ఈ నటి జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు తెలిస్తే .. ఏడవకుండా ఉండలేరు.. ఆమె ఎవరో తెలుసా..?
సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది నిలదొక్కుకోవడానికి ఎన్నో కష్టాలు పడుతూనే ఉంటారు. మరికొంత మంది ఎన్ని కష్టాలు పడినా కూడా నిలదొక్కుకోలేక పోతుంటారు. మరి కొంతమంది ఓవర్నైట్ కష్టపడకుండానే స్టార్డమ్ సంపాదించి, స్టార్ పొజిషన్ కి ఎదుగుతూ ఉంటారు . అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టులు గా పనిచేస్తున్న వాళ్ళు బిజీగానే ఉంటారు.. ఏ పాత్ర వచ్చినా చేయడానికి సిద్ధంగా ఉంటే చేతినిండా సినిమాలు, చేసుకుంటూ పోతే అన్ని అవకాశాలే వస్తాయి. అందులో ఒకరు తెలుగు చిత్రాలలో హీరోయిన్ తల్లి పాత్రలో నటించి,సినీ ప్రేక్షకులను బాగా మెప్పించిన క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో రూప లక్ష్మి కూడా ఒకరు.
ఇకపోతే ఈమె శ్రీ విష్ణు హీరోగా నటించిన నీది నాది ఒకటే కథ మూవీ లో హీరో తల్లి పాత్రలో నటించింది.అంతేకాకుండా కామెడీ డైలాగులతో అదరగొట్టేసింది. సీరియల్స్ లో కూడా నటించింది.అయితే నటి రూప లక్ష్మి తెలుగులో దాదాపు 50కి పైగా చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలో నటించింది.
అయితే తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలిపింది. తన పేరెంట్స్ చిన్నప్పుడు వ్యవసాయం కారణంగా నష్టాలు రావడంతో, కుటుంబ పోషణ భారమైంది అని చెప్పుకొచ్చింది. కానీ దత్తత తీసుకోవడంతో తన జీవితమే మారిపోయింది అని తెలిపింది. దత్తత తీసుకున్న వారు బాగానే చూసుకున్నారని తెలిపింది.
ఇకపోతే ఇంట్లో సభ్యులు ఎవరూ తనని ఇంట్లో కుటుంబ సభ్యురాలిగా అంగీకరించకపోవడంతో, చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చిందని వివరించింది. తాను అప్పటి వరకు బాగానే చదువుతున్న, తను అనుకోకుండా పలు సమస్యలతో విసిగి పోవడంతో, స్టడీస్ ముందుకు సాగడం లేదని రూప లక్ష్మి చెప్పింది.అయితే కొంతకాలం తర్వాత ఇరుగు పొరుగు వాళ్ల ద్వారా తన నిజమైన తల్లిదండ్రులు వేరే ఉన్నారు అని తెలియడంతో వారి దగ్గరికి వెళ్ళిపోవడం తో, ఇటు తన తోడబుట్టిన వాళ్ళకే పెంచుకున్న వాళ్ళకి దగ్గరగా కాలేకపోయాను అంటూ భావోద్వేగానికి లోనయింది. ఇదే విధంగా తన పడిన కష్టాలను ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చింది.