ఈ స్టార్స్ ఎలా చనిపోయారో ఇప్పటికీ రహస్యమే..!

N.ANJI

మనిషి పుట్టక ఎలాగో.. మరణం అలాంటి. మరణం అనేది జీవితంలో ఆఖరీ మజిలీగా భావిస్తాం. అయితే కొన్ని మరణాలు ఎలా సంభవించాయే తెలియకపోతే దానికంటే పెద్ద దారుణం మరొకటి లేదు. సినీ ఇండస్ట్రీలో నటీనటుల మరణాలు మిస్టరీగా మారిపోయాయి. ఇప్పటికీ వీళ్ల మరణాలు ఆత్మహత్య.. లేదా హత్యా అనేది తెలియనే తెలియదు. ఎన్నో హిట్ సినిమాలు తీసి ప్రేక్షకుల మనసును దోచుకున్న వారు అనంతలోకానికి వెళ్లిపోయారు. సినీ పరిశ్రమలో అనుమానాస్పదంగా మరణించిన తారల గురించి తెలుసుకుందాం.



బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14, 2020లో చనిపోయారు. ఇప్పటికీ ఈయన మరణంపై ఎలాంటి స్పష్టత రాలేదు. కొందరు ఆత్మహత్యేనని పేర్కొన్నా.. సీబీఐ నిర్ధారణ ఇవ్వకపోవడంతో పలు అనుమానాలకు దారితీస్తోంది. అలాగే తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ప్రత్యూష కూడా 2002 ఫిబ్రవరి 23వ తేదీన మరణించారు. ఈమె మరణంపై కూడా ఎలాంటి స్పష్టత లేదు.



బాలీవుడ్‌లో నిశ్శబ్ధ్, గజిని, హౌజ్‌ఫుల్ లాంటి పాపులర్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న జియా ఖాన్ 2013 జూన్ 3వ తేదీన చనిపోయారు. అయితే ఈమె మరణం వెనుక బాలీవుడ్ హీరో సూరజ్ పంచోలీ ఉన్నాడంటూ అప్పట్లో బాగానే చర్చలు జరిగాయి. అలాగే.. ఇండియన్ సినిమాలో సంచలన హీరోయిన్‌గా వచ్చిన దివ్య భారతి కేవలం 19 ఏళ్లకే చనిపోయింది. నటి దివ్యను హత్య చేశారని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం ప్రమాదవశాత్తూ చనిపోయిందని పేర్కొన్నారు.



ఫిబ్రవరి 24, 2018న దుబాయ్‌లోని ఓ పెళ్లికి వెళ్లిన అందాల తార నటి శ్రీదేవి కూడా అక్కడే కన్నుమూశారు. గుండెపోటుతో శ్రీదేవి ప్రాణాలు విడిచారని చెప్పినా.. అసలు కారణం ఇప్పటికీ తెలియదు. అదేవిధంగా బాలీవుడ్ సీనియర్ నటి పర్వీన్ బాబీ కూడా జనవరి 20, 2005న అనుమానాస్పదంగా మరణించారు. కుటుంబీకులు మూడ్రోజుల తర్వాత ఆమె మృతదేహాన్ని చూసినట్లు సమాచారం. 1996 డిసెంబర్ 23వ తేదీన సిల్క్ స్మిత కూడా చెన్నైలోని తన సొంతింటిలో చనిపోయారు. కెరీర్, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆమె చనిపోయినట్లు ఊహాగానాలు వినిపించాయి.


బాలీవుడ్ మోడల్ నసీఫా జోసెఫ్ మరణం కూడా మిస్టరీ గానే మిగిలిపోయింది. ఆమె ఆత్మాహుతి వెనుక కాబోయే భర్త హస్తం ఉందని చెప్తున్నా.. పూర్తి ఆధారాలు లేవు. 2000 మార్చి 27వ తేదీన ప్రియా రాజవంశ్ మరణించారు. ఈమెను తన భర్తే చంపాడని నిర్ధారణ అయింది. వరల్డ్ సెన్సేషనల్ హీరో బ్రూస్లీ మరణం కూడా ఇప్పటికీ మిస్టరీ గానే మిగిలిపోయింది. 1973 జూలై 20వ తేదీన ఈయనను ఇంజెక్షన్ ఇచ్చి చంపారని ఇప్పటికీ ప్రచారం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: