టాలీవుడ్ పై సూర్య కన్ను..ఆ రంగంలో సక్సెస్ అవుతారా.?

MADDIBOINA AJAY KUMAR
త‌మిళ హీరో సూర్య‌కు తెలుగులో ఉన్న‌ఫ్యాన్ ఫోలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చేప్పాల్సిన‌వ‌స‌రం లేదు. సూర్య న‌టించిన ఎన్నో సినిమాలు తెలుగులో మంచి విజ‌యం సాధించాయి. ముఖ్యంగా సూర్య న‌టించిన గ‌జిని సినిమాతో తెలుగులో ఆయ‌న ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఈ సినిమా మంచి విజ‌యం సాధించ‌డం..తెలుగు వారికి  తెగ నచ్చేయ‌డంతో సూర్య అభిమానుల సంఖ్య కూడా ఈ సినిమాతో పెరిగింది. అంతే కాకుండా తెలుగు హీరోల‌కు స‌మానంగా సూర్య సినిమాల‌కు క‌లెక్ష‌న్ లు కూడా రావ‌డం విశేషం. దాంతో తెలుగులో నేరుగా ఓ సినిమా చేస్తాన‌ని సూర్య అనేక సార్లు ప్ర‌క‌టించారు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌లేదు. ఇక ఇప్పుడు సూర్య తెలుగులో సినిమా చేసేందుకు ప్లాన్ లు వేస్తున్నారట‌. అయితే సూర్య తెలుగు సినిమా వ‌చ్చేది న‌టుడిగా కాదు..నిర్మాతగా సూర్య ఓ సినిమా చేయ‌బోతున్నారు. సూర్య‌కు సొంతంగా ఓ నిర్మాణ సంస్థ ఉంది. ఇప్ప‌టికే త‌మిళం లో ఆయ‌న కొన్ని సినిమాల‌ను కూడా తీశారు.
సూర్య త‌న భార్య న‌టి జ్యోతిక కోసం కొన్ని సినిమాలను నిర్మించారు. అయితే ఇప్పుడు తెలుగులో కొన్ని చిన్న సినిమాల‌ను త‌న బ్యాన‌ర్ లో చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. అయితే ఈ సినిమాల్లో సూర్య న‌టించ‌ర‌ట‌. తెలుగు హీరోల‌నే పెట్టి సినిమాల‌ను తీస్తార‌ట‌. అంతే కాకుండా సినిమాల‌ను నిర్మించ‌డానికి తెలుగులో ఓ పార్ట్న‌ర్ ను  ను కూడా వెతుకుంటున్నార‌ట‌. ఓ అగ్ర నిర్మాణ సంస్థ‌తో క‌లిసి సూర్య ఈ సినిమాల‌ను తెర‌కెక్కించ‌బోతున్న‌ట్టు తెలుస్తొంది. ఇక సూర్య తెలుగులో ఏ నిర్మాణ సంస్థ‌తో ఒప్పందం కుదుర్చుకుంటారు...ఏ హీరోల‌తో సినిమాలు చేస్తార‌నే వివ‌రాలు త్వ‌రలోనే రాబోతున్నాయి. ఇదిలా ఉండ‌గా సూర్య హీరోగా లాక్ డౌన్ స‌మ‌యంలో వ‌చ్చిన సినిమా సుర‌రైపోట్రు. ఈ సినిమాకు విమ‌ర్ష‌కుల నుండి ప్ర‌శంస‌లు అందాయి. ఈ చిత్రాన్ని ఆకాశ‌మే నీ హ‌ద్దురా పేరుతో తెలుగులో విడుద‌ల చేయ‌గా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక ప్ర‌స్తుతం సూర్య పొన్నియిన్ సెల్వాన్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాను భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: