సీటీమార్ నుంచి మాస్ మసాలా సాంగ్.. మాములుగా లేదుగా..!

Suma Kallamadi
తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో గోపీచంద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విలక్షణ నటుడిగా పరిచయమై స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు గోపీచంద్. ఇక టాలీవుడ్ టాల్ హీరో గోపీచంద్ సరైన సక్సెస్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం ఈ మ్యాచో స్టార్ సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. సీటిమార్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కింది. మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా‌ ఇది. గోపిచంద్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి మెలొడిబ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ భూమిక, బాలీవుడ్ యాక్టర్ త‌రుణ్ అరోరా కీల‌క పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజైన ట్రైల‌ర్‌కి, రీసెంట్‌గా విడుద‌లైన జ్వాలా రెడ్డి సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. కాగా ఈ మూవీ నుండి హాట్ బ్యూటీ అప్స‌రా రాణి స్పెష‌ల్ సాంగ్ ను రిలీజ్ చేసారు చిత్రయూనిట్ . `నా పేరే పెప్సీ ఆంటీ.. నా పెళ్లికి నేనే యాంటీ` లిరిక‌ల్ సాంగ్‌ని ఇటీవల విడుద‌ల చేసింది చిత్ర యూనిట్.
అయితే `నా పేరే పెప్సీ ఆంటీ.. నా పెళ్లికి నేనే యాంటీ..  అంటూ సాగే ఈ పాట‌లో యంగ్ బ్యూటీ అప్సర రాణి హాట్ హాట్ స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టింది. పక్కా మాస్ ఆడియన్స్ ను అలరించేలా మణిశర్మ మాంచి ఐటెం సాంగ్‌ని కంపోజ్ చేశారు. విపంచి రాసిన ఈ పాట‌ను సింగ‌ర్ కీర్త‌న శర్మ అంతే హుషారుగా ఆల‌పించింది. ఈ సాంగ్ యూత్ అండ్ మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటూ సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. ఇక సీటీమార్ సినిమాను ఏప్రిల్ 2న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రిలీజ్‌చేయ‌నున్నారు. మరి ఈ సినిమాతో గోపీచంద్ ఎలాంటి సక్సెస్ అందుకుంటాడా చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: