బిగ్‏బాస్ బ్యూటీకి కరోనా పాజిటివ్...!?

Suma Kallamadi
దేశంలో కరోనా సెకండ్ వే విజృంభణ కొనసాగుతూనే ఉంది. మరలా చాల మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా రెండోదశ ప్రారంభమై..తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇండియాలో సైతం కేసులు పెరుగుతుండటంతో ఆంక్షలు కఠినతరం చేస్తూ  రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. ఇక్క ఇప్పటికే ముంబాయిలో పలు ప్రాంతాలలో రెడ్ జోన్ ప్రకటించింది అక్కడి ప్రభుత్వం.

గత సంవత్సరం చాల సెలెబ్రెటీలు ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఇక తాజాగా హిందీ బిగ్ బాస్ షోలో ఫైనలిస్ట్ గా నిలిచిన నిక్కీ తంబోలి కోవిడ్ బారిన పడింది. ప్రస్తుతం ఆమె హోమ్ క్వారంటైన్ లో ఉంది. అంతే కాదు నిక్కి తంబోలి ఆరోగ్యం నిలకడగానే ఉండటంతో ఇంటి నుంచే డాక్టర్లతో టచ్ లో ఉంటూ తగిన మెడిసిన్స్ వాడుతోందట. ఈ విషయమంతా బిగ్ బాస్ 14 ఫైనలిస్ట్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో వెల్లడించింది.

ప్రస్తుతం నిక్కీ తంబోలి కొన్ని మ్యూజిక్ వీడియోస్ షూటింగ్ లో పాల్గొంటోంది. అయితే, కరోనా కారణంగా ఆమె ఇంటికే పరిమితం అయింది. ‘’ఈ రోజు ఉదయమే కోవిడ్ పాజిటివ్ గా రిపోర్ట్ వచ్చింది. అందుకే, నేను స్వయంగా క్వారంటైన్ లో ఉండాలని నిర్ణయించుకున్నాను. వైద్యుల సలహా మేరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఔషధాలు వాడుతున్నట్లు ఆమె తెలిపారు.

ఇక ఇటీవల తనతో కలిసి ఉన్నవాళ్లందరూ దయచేసి కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నానంటూ.. తన ఇన్‏స్టాలో షేర్ చేసింది. ఇదిలా ఉంటే.. నిక్కితంబోలి చీకటి గదిలో చితక్కొట్టుడు అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యింది. ఆ తర్వాత తిప్పరా మీసం సినిమాలోనూ కనిపించింది. ఈ రెండు సినిమాల తర్వాత నిక్కితంబోలికి తెలుగులో అవకాశాలు రాలేదు. దీంతో తిరిగి బాలీవుడ్ పై దృష్టిపెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఇక బిగ్ బాస్ షో ద్వారా అటు హిందీ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: