యంగ్ హీరో రానా లగ్జరీ హౌస్ ఎప్పుడైనా చూశారా మీరు..!?

N.ANJI
తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో రానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లీడర్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైయ్యాడు రానా. ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కమర్షియల్ గా హిట్టయ్యే సినిమాల కంటే నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టే సినిమాలనే రానా ఎక్కువగా ఎంపిక చేసుకుంటూ ఉండటం గమనార్హం.
ఇక ఒకవైపు తెలుగు సినిమాల్లో అడపాదడపా హిందీ సినిమాల్లో కూడా రానా నటిస్తున్నారు.బాహుబలి సిరీస్ సినిమాలు రానాకు పాన్ ఇండియా ఇమేజ్ ను తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం రానా అరణ్య, విరాటపర్వం అనే సినిమాల్లో నటిస్తుండగా కొద్ది నెలల గ్యాప్ లోనే ఈ రెండు సినిమాలు విడుదలవుతున్నాయి.ఇప్పటికే విడుదలైన విరాటపర్వం టీజర్ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.
అంతేకాదు.. తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సాయిపల్లవి ఈ సినిమాలో నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.ఇకపోతే రానా లగ్జరీ హౌస్ కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రానా చాలా సంవత్సరాల క్రితం నుంచే ఈ ఇంట్లో ఉంటున్నా అతని ఇంటికి సంబంధించిన ఫోటోలు గతంలో ఎప్పుడూ వైరల్ కాలేదు.ఈ ఇల్లు రానా సొంత ఇల్లు కాగా రామానాయుడు స్టూడియోస్ కు పరిసరాల్లోనేన్ ఈ ఇల్లు ఉండటం గమనార్హం.
అయితే తన టేస్ట్ కు తగిన విధంగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి రానా ఈ ఇంటిని నిర్మించుకున్నారు.రానా తన ఇంట్లోనే విజువల్ ఎఫెక్ట్స్ కు సంబంధించిన స్టూడియోను కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈ ఇంటి కోసం రానా ఎంత ఖర్చు చేశారనే సంగతి తెలియాల్సి ఉంది.ప్రస్తుతం రానా ఒక్కో సినిమాకు 5 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. రానా నటించిన మరో రెండు సినిమాలు హిట్టైతే మాత్రం రానా రెమ్యునరేషన్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: