స్టార్ హీరోయిన్...ప్రొడ్యూసర్ మధ్యన వివాదం...కారణమిదేనా...?

VAMSI
సినీ ఇండస్ట్రీ అన్నాక ఎన్నో సమస్యలు ఉంటాయి. విమర్శలు ఎదురవుతూ ఉంటాయి. అయితే వీటన్నింటినీ లెక్క చేయకుండా ముందుకు వెళితేనే మీరు అనుకున్న స్థాయికి చేరుకోగలరు. అంతే కాకుండా కొన్ని సందర్భాలలో ప్రొడ్యూసర్స్ కి మరియు నటీనటులకు మధ్యన కొన్ని వివాదాలు జరగడం సహజమే. అయితే కొంతమంది వీటిని చూసీ చూడనట్టు వదిలేస్తారు, మరి కొందరైతే నానా రభస చేస్తారు. అయితే ఇప్పుడు తాజాగా ఒక హీరోయిన్ కి మరియు ప్రొడ్యూసర్ కి మధ్యన వివాదం జరిగినట్లు సమాచారం. దానికి గల కారణాలేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాము.
మాములుగా సినీ ఇండస్ట్రీలో వివాదం అంటే ఒక్కటే ఉంటుంది, ఒక సినిమాకు పనిచేయడానికి వారికి ఇచ్చే పారితోషికం విషయంలో, ఇది నిర్మాతకు దర్శకుని మధ్య ఉండొచ్చు, అలాగే నిర్మాతకు నటీనటుల మధ్యన రావొచ్చు.    ఒక్కోసారి పారితోషికం విషయంలో పెద్ద పెద్ద సినిమాలు ఆగిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ఒక ప్రముఖ హీరోయిన్ కు మరియు ఒక మహిళా నిర్మాత మధ్యన పారితోషికం విషయంలో విభేదాలు రావడంతో తెలుగు సినీ పరిశ్రమలో దీనిపై చర్చ జరుగుతోంది. నిర్మాతగా తొలి అడుగులు వేస్తున్న ఒక స్టార్ ప్రొడ్యూసర్ కుమార్తె ఒక ప్రాజెక్ట్ కోసం ప్రముఖ హీరోయిన్ ను సంప్రదించారు.
కథ వినిన తరువాత ఆ హీరోయిన్ సినిమాకు అంగీకరించిందట, కానీ పారితోషికం విషయంలో హీరోయిన్ చెప్పిన అమౌంటుకు నిర్మాత సుముఖంగా లేకపోవడంతో గొడవ స్టార్ట్ అయింది. అయితే దీనిపై బేరసారాలు జరిగినప్పటికీ, నిర్మాత చెప్పిన దానికి హీరోయిన్ సంతోషంగా లేకపోవడంతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోయింది. దానితో ఈ ప్రాజెక్ట్ నుండి హీరోయిన్ తప్పుకుంది. అయితే హీరోయిన్ ఈ విషయాన్ని ఒక స్టార్ హీరో దగ్గర చెప్పుకుని బాధపడిందట.  మరి నిర్మాత ఏమైనా తక్కువ తినిందా...ప్రస్తుతం తగినన్ని ప్రాజెక్టులు లేని సమయంలో అంత రెమ్యూనరేషన్ అడగడం కరెక్ట్ కాదని ఆమె సన్నిహితుల దగ్గర చెప్పుకుని వాపోయిందట. అయితే ఈ వివాదం మరెంత దూరం వెళుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: