బ్రిటీష్ దిన పత్రిక ‘గార్డియన్’ ప్రశంసలు పొంది ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాస్తూ త్వరలో 300 కోట్ల కలెక్షన్స్ మైలురాయిని కూడ అందుకోబోతున్న ‘బాహుబలి’ ఘన విజయం రాజమౌళికి సంతృప్తిని ఇవ్వలేదని తెలుస్తోంది. ఆశ్చర్యం కలిగిస్తున్న ఈ కామెంట్స్ మాత్రం నిజం. ‘బాహుబలి’ విడుదల తరువాత మీడియా ముందుకు వచ్చి ఇప్పటి వరకు ఎటువంటి కామెంట్స్ చేయని రాజమౌళి ప్రముఖ బాలీవుడ్ విమర్శకుడు రాజీవ్ మసంద్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేసాడు.
‘బాహుబలి’ కలెక్షన్స్ పరంగా ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తున్నా ఆ సినిమాకు సంబంధించిన రియల్ ఫీడ్ బ్యాక్ తనకు ఇంకా పూర్తిగా రాలేదని షాకింగ్ కామెంట్స్ చేసాడు రాజమౌళి. అంతేకాదు తనకు ఇప్పటివరకు ‘బాహుబలి’ కలెక్షన్స్ డేటా మాత్రమె అందుతోంది కాని ఈ సినిమాకు సంబంధించిన అసలైన నిర్మాణాత్మకమైన విమర్శలకు సంబంధించిన డేటా తనకు ఇంకా అందలేదని ఆ డేటా కోసమే తాను చాల ఆత్రంగా ఎదురు చూస్తున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు జక్కన్న.
అయితే ‘బాహుబలి’ సినిమాకు సంబంధించి నిర్మాణాత్మకమైన కామెంట్స్ కు సంబంధించిన సమాచారం తన వద్దకు చేరడానికి మరో రెండు మూడు వారాలు పట్టినా ఆశ్చర్యo లేదని అప్పటివరకు ఈ సినిమా పై తనకు వస్తున్న ప్రశంసలు తనకు ఆనందాన్ని కలిగిస్తాయి కాని ఆ ప్రశంసలు తన దర్శకత్వ ప్రతిభను మెరుగు పరుచుకోవడానికి పనికి రావు అంటూ అభిప్రాయ పడుతున్నాడు ఈ జక్కన్న.
‘బాహుబలి’ పై తాను ఎదురు చూస్తున్న నిర్మాణాత్మకమైన సూచనలు అందిన తరువాత మాత్రమే తాను ‘బాహుబలి 2’ ఫైనల్ స్క్రిప్ట్ విషయంలో చేయబోయే మార్పులు చేర్పులు గురించి ఆలోచిస్తానని అప్పటివరకు కేవలం ఈ సక్సస్ మాత్రమే ఎంజాయ్ చేస్తాను అంటూ రాజమౌళి చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ మీడియాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి..