హ్యాట్రిక్ హిట్ పై కన్నేసిన హీరోయిన్.. మళ్లీ ట్రాక్ లోకి వస్తుందా..?

praveen
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమలో చేసినవి కొన్ని సినిమాలే అయినప్పటికీ ఎంతగానో క్రేజ్ సంపాదించింది లావణ్య త్రిపాటి. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీ బిజీగా ఉన్న హీరోయిన్ గా కొనసాగుతుంది లావణ్య త్రిపాఠి. నటనకు ప్రాధాన్యమున్న పాత్రల తో పాటు గ్లామర్ పాత్రలు కూడా చేస్తూ అటు ప్రేక్షకులను కట్టిపడేసి  తనవైపు తిప్పుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే ప్రస్తుతం లావణ్య త్రిపాటి వరుసగా రెండు విజయాలను తన ఖాతాలో వేసుకుని ఫుల్ జోష్ లో ఉంది అనే విషయం తెలిసిందే.

 గతంలో నిఖిల్  తో కలిసి నటించిన అర్జున్ సురవరం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో లావణ్య త్రిపాటి నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా వచ్చాయి. ఇక ఆ తర్వాత ఇటీవలే సందీప్ కిషన్ తో నటించిన ఏ వన్ ఎక్స్ప్రెస్ అనే సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇలా  వరుసగా రెండు విజయాలు ను తన ఖాతాలో వేసుకుంది లావణ్య త్రిపాటి. ఇలా రెండు విజయాలతో ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్న లావణ్య త్రిపాటి ఇక ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు సిద్ధం అవుతుంది అన్నది అర్ధమవుతుంది.

 టాలీవుడ్ యువ నటుడు కార్తికేయ హీరోగా నటించిన చావు కబురు చల్లగా అనే సినిమా మార్చి 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కార్తికేయ సరసన సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాటి నటించింది. అయితే డిఫరెంట్ కాన్సెప్ట్తో కూడిన సినిమాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అన్న  విషయం తెలిసిందే. ఇక ఇటీవలే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఇక ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అర్జున్ ఈ సినిమా గురించి ఎంతో గొప్పగా మాట్లాడటం..  సినిమా కొత్తగా ఉంటుంది అంటూ చెప్పడంతో ఇక అభిమానులందరిలో  ఈ సినిమా పై మరింత ఆసక్తి పెరిగిపోయింది. సినిమా విజయం సాధిస్తే ఈ అమ్మడి ఖాతాలో హ్యాట్రిక్ పడినట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: