నా జీవితాన్ని మీరే నిర్ణయిస్తారు..ట్రోల్ చేస్తారు : సునీత ఎమోషనల్
సింగర్ సునీత మహిళా దినోత్సవం సందర్భంగా ఆసక్తికర ట్వీట్ చేశారు. తన రెండు పెళ్లిపై వచ్చిన ఎన్నో విమర్శలకు ఆమె సోషల్ మీడియా పోస్ట్ ద్వారా సమాధానం చెప్పారు . తన నిజ జీవితంలో ఎన్నో విమర్శలను ఎదురుకొన్నానని..ఎన్నో ఎదురు దెబ్బలు తిన్ననాని చెప్పారు. వాటినే ఇప్పుడు పునాది రాళ్లుగా మార్చుకుని జీవితంలో ముందుకు సాగుతున్నానని చెప్పారు. సునీత ఓ సుదీర్ఘమైన ట్వీట్ తో తన ఆవేదన చెబుతూనే..ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. "నా జీవితాన్ని మీరే నిర్ణయిస్తారు. ట్రోల్ చేస్తారు. నన్ను ప్రతి సారి కిందకు లాగుతుంటారు . నాలో అభద్రత భావాన్ని నింపుతారు. ఎదో ఒక రూపంలో నన్ను తప్పని ప్రూవ్ చేయాలని చూస్తారు. మీరు ఎప్పుడూ నన్ను నమ్మరు..నాకు అండగా నిలవరు. ఆఖరికి నేను చెప్పేది కూడా మీరు వినరు . నేను ఓడిపోయినప్పుడు నన్ను చూసి మీరు నవ్వుతుంటారు. ఎలాంటి కారణం నిందించిన మీరే ఇప్పుడు నాకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు చెబుతున్నారా.?
అంటూ పోస్ట్ చేసింది. "నేను మీ శుభాకాంక్షలను స్వీకరిస్తున్నాను. ఎందుకంటే మీరు నాపై విసిరిన రాళ్లనే పునాదులుగా మార్చుకుని నా జీవితంలో ముందుకు సాగుతున్నాను. చిరునవ్వుతో అన్నింటిని క్షమించాను. ప్రేమను పంచాను. ఎందుకంటే నేను ఒక స్త్రీని ..అన్నింటిని సహించాను. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు" అంటూ మరో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం సునీత చేసిన పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి. ఇక సింగర్ సునీత రెండో పెళ్లిపై ఎప్పటి నుండో వార్తలు రాగా ఆమె ఇటీవల డిజిటల్ మీడియా అధినేత రామ్ ను పెళ్లి చేసుకుని అందరికి షాక్ ఇచ్చింది. అయితే సునీత పెళ్లిని చాలామంది సమర్ధించగా కొందరు మాత్రం ఆమె పెళ్లిపై ట్రోలింగ్ చేసారు. అలాంటి వారికి సునీత ఇప్పుడు తన పోస్ట్ తో సమాధానం ఇచ్చింది .