బాలయ్యతో ఉప్పెన డైరెక్టర్ కాంబో...?

Satya
ఉప్పెన మూవీతో తన స్టామినా ఏంటో గట్టిగానే ప్రూవ్ చేసుకున్నాడు సానా బుచ్చిబాబు. సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీలో చాలా సినిమాలకు పనిచేసిన బుచ్చిబాబుకు తొలి సినిమాయే అదిరిపోయే హిట్ ఇచ్చింది. ఈ మూవీతో టాలీవుడ్ కి కూడా బ్లాక్ బస్టర్ల కరువు తీరింది. కొత్త డైరెక్టర్ గా బుచ్చిబాబుకు చక్కని ఫ్లాట్ ఫారాన్ని కూడా ఇచ్చింది.
ఈ మూవీ తరువాత బుచ్చిబాబుకు అగ్ర హీరోల‌ నుంచి అవకాశాలు వెల్లువలా వస్తున్నాయని అంటున్నారు. అయితే బుచ్చిబాబు మరో రెండు సినిమాలను తనకు తొలి అవకాశం ఇచ్చిన‌ మైత్రీ మూవీ మేకర్స్ కే చేయాలని కమిట్ అయ్యారుట. ఆ విధంగా బుచ్చిబాబుని మైత్రీ మూవీ  మేకర్స్ లాక్ చేసేశారు అంటున్నారు. ఇదిలా ఉంటే బుచ్చిబాబు కొత్త సినిమా గురించి ఇపుడు ఇంటెరెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వస్తోంది. ఆయన నందమూరి హీరో బాలయ్యతో తన తరువాత సినిమా చేయబోతున్నాడు అని అంటున్నారు. బాలయ్య ఇపుడు తన రూట్ మార్చేశాడు.ఇంతకాలం సీనియర్ డైరెక్టర్లు, కొందరు ఫ్లాప్ డైరెక్టర్లతో కూదా సినిమాలు చేశాడు. తనకు వాళ్ళతో ఉన్న పరిచయాలతో అలా అవకాశాలు ఇస్తూ వెళ్ళాడు.
ఆ విధంగా చేయడం ద్వారా బాలయ్య తన మార్కెట్ కి కూడా కోరి  ఇబ్బంది తెచ్చుకున్నాడు. ఇపుడు బాలయ్య పూర్తిగా మారిపోయాడు అంటున్నారు. ఆయన కూడా సక్సెస్ ఫుల్ డైరెక్టర్లతోనే మూవీస్ చేయడానికి ఇంటెరెస్ట్ చూపిస్తున్నాడు. దీంతో బాలయ్య క్రాక్ తో హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని తో ఒక సినిమా ఇపుడు చేస్తున్నాడు. అలాగే ఉప్పెనతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బుచ్చిబాబుని కూడా లైన్ లో పెట్టాడని టాక్. అదే కనుక నిజమైతే బాలయ్య ఫ్యాన్స్ కి పండుగే అంటున్నారు. మరి పక్కా మాస్ హీరో అయిన బాలయ్యతో ఉప్పెన వంటి ప్రేమ కధను తీసిన సానా బుచ్చిబాబు ఎలాంటి స్టోరీ చేస్తాడు అన్నది పెద్ద చర్చగా ఉందిట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: