విజృంభిస్తున్న చైనా వైరస్...HMPV లక్షణాలు ఇవే....?
చైనా నుంచి ఇండియాలో కూడా ఈ వైరస్ రావడం జరిగింది. వాస్తవంగా ఈ HMPV వైరస్ గతంలోనే ఇండియాలో ఉందట. 2001 సంవత్సరంలోనే ఈ చైనా HMPV వైరస్ ను మన వైద్య నిపుణులు గుర్తించారట. కాబట్టి కరోనా వైరస్ తరహాలో ఈ వైరస్ ఉండబోదన్నమాట. అయితే... కరోనా వైరస్ సోకితే ఎలాంటి లక్షణాలు ఉంటాయో అచ్చం HMPV లక్షణాలు కూడా అలాగే ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఈ HMPV వైరస్ సోకితే ఊపిరితిత్తుల పైన ప్రభావం చూపిస్తుందట. శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుందని చెబుతున్నారు వైద్యులు. జలుబు అలాగే దగ్గు, జ్వరం, ఒంటి నొప్పులు కూడా వస్తాయట. ఈ లక్షణాలు వస్తే కచ్చితంగా ఆసుపత్రికి వెళ్లాలని సూచిస్తున్నారు వైద్యులు. సొంతంగా ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకోకూడదని... వివరిస్తున్నారు. అయితే కరోనా కంటే ఇది పెద్ద డేంజర్ కాదని అంటున్నారు.
కానీ చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. జలుబు లాంటిది వస్తే... మాస్క్ ధరించడం మేలని అంటున్నారు. కాబట్టి ఇకపైన జలుబు లేదా దగ్గు వస్తే జాగ్రత్తగా ఉండాలి. మన దగ్గర వాళ్లు ఎవరికైనా వచ్చినా కూడా.. వాళ్లకు జాగ్రత్తలు చెబుతూ మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక కేంద్రం కూడా దీనిపై పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని వెల్లడించింది. అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని క్లారిటీ ఇచ్చింది కేంద్ర సర్కార్.
లక్షణాలు:
దగ్గు
జ్వరం
నాసికా రద్దీ
గొంతు నొప్పి
ఊపిరి ఆడకపోవడం