కరోనానే జయించాం...HMPV ఇది పెద్ద లెక్కనా ?

Veldandi Saikiran
మొన్నటి వరకు ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గడగడలాడించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డ జనాలు కొన్ని రోజులుగా చాలా హ్యాపీగా ఉంటున్నారు. ఇంతలోనే చైనా వాడు మరో కొత్త వైరస్.. అంటూ అందరినీ భయపడుతున్నాడు. ఇప్పటికే.. HMPV అనే వైరస్ చైనాలో పాకేసింది. రోజుకు వందల మంది ఆసుపత్రి పాలవుతున్నారట.

అయితే ఈ వైరస్ కాస్త మన ఇండియాకు కూడా వచ్చేసింది. సోమవారం రోజున అహ్మదాబాద్, కర్ణాటక రాష్ట్రం ఇలాంటి కీలక ప్రాంతాల్లోనే... ఈ కొత్త చైనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అది కూడా చిన్న పిల్లల పైన ఈ వైరస్ సోకింది. ఈ HMPV వైరస్ ఎక్కువగా 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలపై ప్రభావం ఉంటుందట. అలాగే వృద్ధులపై.. ఈ చైనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

కానీ కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఈ HMPV వైరస్ పట్ల పెద్దగా.. భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఈ చైనా HMPV వైరస్ 2001 సంవత్సరంలోనే భారత్ లో తెరపైకి వచ్చిందని అంటున్నారు.  అప్పుడు ఇండియా సమర్థవంతంగా ఈ వైరస్ తో పోరాడిందని గుర్తు చేస్తున్నారు. కాబట్టి ఈ HMPV వైరస్ పట్ల తప్పుడు ప్రచారం చేయకండి అని సూచిస్తున్నారు.

గత మూడు సంవత్సరాల కిందట ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారిని తరిమికొట్టిన భారత్... ఈ చిన్న వైరస్ ను తరిమికొట్టలేదా అని కొంతమంది చెబుతున్నారు. ఈ వైరస్ ను తొలి దశ లోనే అంతం చేసేందుకు అందరు నడుము కట్టాలని సూచిస్తున్నారు. జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాలని అంటున్నారు. ఆందోళన పడకుండా... కరోనా అప్పుడు ఎలా ఉన్నామో జాగ్రత్తగా ఇప్పుడు HMPV వైరస్ పట్ల కూడా అలా ఉంటే సరిపోతుందని సూచిస్తున్నారు వైద్యులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: