అమ్మో.. అమ్మో.. ఇంత పెద్ద మాస్టర్ ప్లాన్ తోనే ప్రభాస్ ‘సలార్’ రిలీజ్ అవుతోందా?

savitri shivaleela
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఒక్కో సినిమాను కంప్లీట్ చేస్తూ.. వాటిని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రభాస్ ఎంతో శ్రమిస్తున్నారు. ప్రస్తుతం ఈ  ఆరడుగుల అందగాడు ప్రశాంత్ నీల్ తో పాన్ ఇండియా మూవీ ‘సలార్’ నటిస్తున్న సంగతి తెలసిందే. కమర్షియల్ మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను తాజాగా ఈ సినిమా దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14, 2022 లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ వార్త తెలియగానే డార్లింగ్ అభిమానుల్లో ఆనందానికి అవద్దుల్లేకుండా పోయాయి. బాహుబలి సినినిమాకు ప్రభాస్ ఐదేండ్ల కాలం తీసుకున్నాడు. దీంతో పాటుగా సాహో సినిమాకు కూడా రెండేండ్ల గ్యాప్ తీసుకున్నారు ప్రభాస్.
ఇన్ని ఏండ్ల గ్యాప్ తీసుకున్న ప్రభాస్ ప్రస్తుతం వీలైనన్ని సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయారు. ఇక ఈ సినిమాలతో వరుసగా ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.  ‘రాధేశ్యామ్’ సినిమాతో ప్రభాస్ 2021 జులై 30 ప్రేక్షకులను అలరించబోతున్నాడు. ఇది  రిలీజ్ అయిన 8 నెలల్లోనే ప్రభాస్ మళ్లీ ‘సలార్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మీకు తెలుసా.. ఏప్రిల్ 14 నే ఎందుకు సలార్ ను రిలీజ్ చెయ్యబోతున్నారనేది. ఇది తెలిస్తే.. అమ్మో.. అమ్మో.. ఇంత పెద్ద మాస్టర్ ప్లాన్ వేసి రిలీజ్ చేస్తున్నారా అనకుండా ఉండరేమో.ముందే ఈ  మూవీ పాన్ ఇండియాగా ప్రేక్షకుల ముందుకు రానుంది.. అందుకే ముహూర్తాలు అన్ని పక్కాగా చూసుకునే ఈ మూవీని రిలీజ్ చెయ్యడానికి పక్కా ప్లాన్స్ వేశారు దర్శక నిర్మాతలు.
అందులోనూ ఓపెనింగ్ చాలా కీలకం కదా.. అందుకే భారీ ఎక్స్ పెక్టేషన్స్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి ఉంది. ఆ తర్వాతి రోజు 15 గుడ్ ఫ్రైడేనే. ఇక ఆ తర్వాతి రోజు 16 శనివారం ఉంది. అలాగే 17న ఎలాగూ సన్ డేనే వస్తుంది. మొత్తంగా ఈ  ఐదు రోజులు వీకండ్ అన్న విషయం మీకు తెలుసా.. ఇన్ని సెలవులు ఉన్నాయని ఆలోచించే ఈ ఫర్ఫెక్ట్ డేట్ ను ఫిక్స్ చేశారు దర్శక నిర్మాతలు. ఈ ఐదు రోజులు చాలు ప్రభాస్ ఈజీగా 200 కోట్లను కొల్లగొట్టడానికి . ఈ ప్లానింగ్ తోనే ఈ చిత్ర యూనిట్ ఈ డేట్ ను ఫిక్స్ చేసింది. ముందే ఈ సినిమా ఈ రిలీజ్ డేట్ ను లాక్ చేసింది కాబట్టి.. వేరే హీరోలు ఆ డేట్ జోలికి వల్లరనే అర్థమవుతోంది. ఏదేమైనా ఈ రిలీజ్ డేట్ గురించి తెలుసుకున్న వారంతా.. ప్రభాస్ ప్లానింగ్ ఏమన్నా ఉందా అంటూ ఓ తెగ పొగిడేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: