మిస్ ఆసియా పసిఫిక్ దియా...ఇప్పుడు సరికొత్తగా...!

VAMSI
2000 మిస్ ఆసియా పసిఫిక్ దియా మీర్జా.. ఈ క్రౌన్ బ్యూటీ గురించి మరో లేటెస్ట్ అప్ డేట్ సందడి చేస్తోంది. ఇటీవలే ఫిబ్రవరి 15 న ప్రముఖ వ్యాపారవేత్త వైభవ్ ని వివాహం చేసుకున్నారు. ఈమె పెళ్లి వేడుకకు సంబంధించిన  ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు దియా. ఇద్దరికీ ఇది రెండో వివాహం అన్న సంగతి తెలిసిందే. అభిమానులు కూడా వీరి పెళ్లికి సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి  ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం దియా వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నాయి.

అయితే  తాజాగా ఈ బాలీవుడ్ బ్యూటీ ప్రఖ్యాత `ఆజా ఫ్యాషన్స్` అనే మ్యాగజైన్ కవర్ పేజీపైన న్యూ లుక్ తో కనిపించింది. ధగ ధగ మెరిసే చీరలో ట్రెడిషనల్ లుక్ లోనే సూపర్ గ్లామర్ గా దర్శనమిచ్చింది. ఈ ఫోటో చూసిన అభిమానులు మీ గ్లామరే గ్లామర్ క్రౌన్ బ్యూటీ అంటూ తెగ పొగిడేస్తున్నారు. ఆ పిక్ లో ఆమె అందం కూడా అదే రేంజ్ లో ఉంది మరి. ఇదిలా ఉండగా.... అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో..ఇన్వెస్టిగేషన్ డ్రామాగా తెరకెక్కుతున్న సినిమా వైల్డ్‌డాగ్ లో దియామీర్జా నటిస్తున్న సంగతి తెలిసిందే.

వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ( National Investigation Agency ) ఆఫీసర్ విజయ్ వర్మ పాత్రలో నాగార్జున కనిపించనున్నారు. ఈ చిత్రంలో నాగార్జునతో  దియా మీర్జా జత కట్టారు. ఈ చిత్రంలో దివ్య పాత్ర ఎంతో ప్రత్యేకమని.. అందుకు తగ్గట్టే ఆమె నటన కూడా సూపర్ అని సమాచారం. మరి ఈ సినిమా దియా మీర్జా కు ఎలాంటి గొప్ప గుర్తింపు తీసుకురానుందో చూడాలి. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. మరి ఇందులో తన పాత్రకు మంచి పేరు వచ్చి, సినిమా కనుక హిట్ అయితే తెలుగు సినీ పరిశ్రమలో కొంత కాలం కొనసాగవచ్చు. మరి ఏమి జరగనుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: