కొత్త అవతారం ఎత్తపోతున్న కంగనా.. ఏకంగా సొంతూరులో..?
ఇలా ఎన్నో ఏళ్ల నుంచి బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది కంగనారనౌత్. అయితే కేవలం సినిమాల ద్వారానే కాదు తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో హాట్ టాపిక్ గా మారి పోతూనే ఉంటుంది కంగనారనౌత్. వివిధ రకాల వివాదాలకు కంగనారనౌత్ కేరాఫ్ అడ్రస్ గా మారిపోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈ అమ్మడు సినిమాల ద్వారా ఎంతో క్రేజ్ సంపాదించినదో వివాదాల ద్వారా కూడా అంతే క్రేజ్ సంపాదించింది అని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం ఎంతో మంది హీరోయిన్లు అటు సినిమాల్లో దూసుకు పోతూ ఉండడంతో పాటు బిజినెస్ ఉమెన్ గా కూడా రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే.
ఇక ఇప్పుడు కంగనారనౌత్ కూడా కొత్త అవతారం ఎత్తపోతున్నట్లు తెలుస్తోంది. ఈసారి సినిమాల కోసం కాకుండా రియల్ వ్యాపారవేత్తగా మారేందుకు సిద్ధమైంది కంగనా రనౌత్. హిమాచల్ ప్రదేశ్ లోని తన సొంతూరు అయిన మనాలిలో ఒక కేఫ్ రెస్టారెంట్ ఓపెన్ చేసేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించింది. ఇది నా కల.. సినిమాల తర్వాత నాకు ఎంతో ఇష్టమైనది ఆహారం అంటూ కంగనా రనౌత్ సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది. కంగనా రనౌత్ పోస్ట్ పై స్పందిస్తున్న అభిమానులు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.