చిరు పిలిచి మరీ ఛాన్స్ ఇస్తే మణిశర్మ ఇలా చేశాడేంటి..?
అయితే తొలిసారి కొరటాల శివ దేవి శ్రీ ప్రసాద్ ని కాదని మణిశర్మ తో ఈ సినిమా చేస్తున్నాడు.చిరు బలవంతం మీదే మణిశర్మ తో ఈ సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది.. చిరు మణిశర్మ లది ఎంత పెద్ద హిట్ కాంబినేషనో అందరికి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలన్నీ దాదాపు సక్సెస్ తీరం చేరాయి. బావగారూ బాగున్నారా చిత్రం నుంచి మొదలైన వీరి కాంబినేషన్.. చూడాలని ఉంది, అన్నయ్య, ఇంద్ర, ఠాగూర్, స్టాలిన్.. ఇలా దాదాపు 10కి పైగా చిత్రాల వరకు కొనసాగింది. అప్పట్లో చిరు-మణిశర్మ కాంబినేషన్ అంటే పక్కా హిట్.. రాసుపెట్టికోండి అనేలా పేరు పడింది.
కాకపోతే.. ఆ తర్వాత వీరిద్దరి మధ్య వచ్చిన కొన్ని మిస్ అండర్‌స్టాండింగ్స్ కారణంగా చిరు.. మణిశర్మని దూరం పెట్టేశాడు.మళ్లీ వీరిద్దరి మధ్య ఉన్న మిస్ అండర్‌స్టాండింగ్స్ దూరమవడం.. చిరు బర్త్‌డే కోసం మణిశర్మ ప్రత్యేకంగా పాటలు కంపోజ్ చేయడం వెరసీ.. కొరటాలతో చిరు చేస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆచార్య కు మ్యూజిక్ కంపోజ్ చేసే అవకాశం మణిశర్మను వరించింది. అయితే ప్రస్తుతం ఆచార్య మ్యూజిక్ విషయంలో చిరు అసంతృప్తిగా ఉన్నాడనేలా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల వచ్చిన ఆచార్య ట్రైలర్ మ్యూజిక్ విషయంలో కూడా చిరు అసంతృప్తిని ప్రదర్శించాడనేలా వార్తలు వినిపిస్తున్నాయి. ముందు రెడీ అయిన ట్రైలర్‌కి మ్యూజిక్ నచ్చకపోవడంతో.. మళ్లీ చిరు మ్యూజిక్ మార్పించారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.