పెళ్లి చేసుకోవాలనుకున్నవాడు గే అని తెలిసి.. జయసుధ సాహసం..?

P.Nishanth Kumar
టాలీవుడ్ లో జయసుధ గారి గురించి చెప్పాలంటే ఆమె ఎంత గొప్ప నటో  ముందుగా చెప్పాలి.. అలనాటి తరం నుంచి ఈనాటి తరం దాకా అందరి హీరోలతో నటించింది జయసుధ.. హీరోయిన్ గా తన ప్రస్థానం మొదలుపెట్టిన జయసుధ ఇప్పుడు అమ్మ పాత్రలకు, వదిన పాత్రలకు కూడా పెట్టింది పేరుగా నిలిచింది.. పెద్ద సినిమాలకు , పెద్ద హీరోలకు అమ్మ పాత్ర అంటే గుర్తుకొచ్చేది జయసుధ నే. సహజ నటిగా పేరున్న జయసుధ గురించి చెప్పాలంటే చాలానే ఉంది..
అక్కినేని నాగేశ్వర రావు , సూపర్ స్టార్ కృష్ణ, ఎన్టీఆర్ ల సరసన నటించింది జయసుధ.. ఆ తర్వాత వరుసగా అవకాశాలు తగ్గినా జయసుధ ఏమాత్రం ఆలోచించకుండా తన వయసుకు తగ్గ పాత్రలు చేసింది..మొదట్లో వదిన పాత్రలు చేసిన జయసుధ ఆ తర్వాత అమ్మ పాత్రలు చేసేది. ఇకముందు బామ్మా పాత్రలు కూడా చేస్తుంది కాబోలు.. ఇక పోతే ఆమె ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
తనది చాలా సంప్రదాయబద్ధమైన కుటుంబమని దాంతో తన తండ్రి ఎంతో క్రమశిక్షణతో తమని పెంచాడని చెప్పుకొచ్చింది.ఇక అప్పట్లో తమది ఉమ్మడి కుటుంబం కావడంతో తమ ఇంట్లో చాలా మంది ఉండేవాళ్ళని అంతేగాక తన ఇంట్లో 16 ఏళ్ల నుంచి 18 సంవత్సరాలు నిండగానే ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసేవారని తెలిపింది.ఈ క్రమంలో తాను కూడా పెళ్లి వయసు రాగానే ప్రముఖ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ని పెళ్లి చేసుకుందామని అనుకున్నానని తన మనసులో మాట బయట పెట్టింది. అది కూడా కుదరకపోవడంతో చివరికి బాలీవుడ్ సినిమా పరిశ్రమలో పేరు పొందిన ప్రముఖ సింగర్ ని పెళ్లి చేసుకుందామని అనుకున్నానని కానీ అతడు చివరికి గే అని తెలియడంతో ఆ కల కూడా నెరవేరలేదని సరదాగా చెప్పుకొచ్చింది. ఇక జయసుధ కేవలం నటిగా మాత్రమే కాకుండా రాజకీయాల్లో కూడా చేరి ప్రజలకు సేవ చేసి మంచి రాజకీయ నాయకులు అధిక కూడా గుర్తింపు తెచ్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: