గ్లోబల్ స్టార్ హీరోయిన్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు. ?. తెలిస్తే ఆశ్చర్యపోతారు.!!
బాలీవుడ్ లో స్టార్ హోదా అనుభవిస్తూ ఉండగానే హాలీవుడ్లో అవకాశాలు రావడంతో హాలీవుడ్ వైపు మళ్ళింది. ప్రియాంక చోప్రా "బెవాచ్"అనే హాలీవుడ్ మూవీ తో హాలీవుడ్‌లో అడుగుపెట్టి స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్నారు. ఈ క్రమంలో 2018లో అమెరికా సింగర్ నిక్ జోన్‌స్ పెళ్లి చేసుకున్న ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ మూవీస్ లో ఎక్కువగా నటిస్తూ, ప్రస్తుతం కొన్ని ఇండియన్ ప్రాజెక్ట్ లు చేస్తూనే వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది.
ప్రియాంక చోప్రా ‘అన్‌ఫినిష్డ్’ పేరుతో స్వయంగా తన ఆత్మకథను రాసుకున్నారు. అది పూర్తి చేసి ఇటీవల ఫిబ్రవరి 9న ఈ బుక్‌ను విడుదల చేశారు. ఇందులో ఆమె ప్రస్తావించిన కొన్ని సంఘటనలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. కెరీర్ ఆరంభంలో తన అవయవ సౌష్టవం గురించి కొందరు నిర్మాతలు, దర్శకులు చేసిన కామెంట్లు, తనకు ఎదురైనా చేదు అనుభవాలు, విషయాల గురించి ఈ పుస్తకంలో రాసుకున్నారు.
ప్రభాస్, ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రం ‘సలార్’. మూవీలో స్పెషల్ సాంగ్ కు గ్లోబల్ స్టార్, హీరోయిన్ ప్రియాంక చోప్రాను దర్శకుడు సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రియాంక చోప్రా తన అద్భుతమైన నటన తో బాలీవుడ్ , హాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణించింది.