ఆ సినిమాకు ఏకంగా 9 ఫిల్మ్ ఫేర్ అవార్డులు.. 5 నంది అవార్డులు.. మొత్తం తొమ్మిది భాషల్లో రీమేక్ చేయబడినది...!

Divya

ప్రస్తుతం మన సినీ ఇండస్ట్రీలో ఒక సినిమాకు మహా అంటే రెండు ఫిలిం ఫేర్ అవార్డులు, ఒక నంది అవార్డు వస్తుంది. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ హల్చల్ చేస్తోంది కాబట్టి అన్ని భాషల్లో రిలీజ్ అవ్వడానికి కారణాలు ఉన్నాయి. కానీ అప్పట్లో విడుదలైన ఒక సినిమాకు మాత్రం ఏకంగా ఎవరూ ఊహించని స్థాయిలో 9 ఫిలింఫేర్ అవార్డులు,5 నంది అవార్డులు దక్కాయి. అంతేకాకుండా మొత్తం తొమ్మిది భాషలలో ఆ సినిమా రీమేక్ చేయబడి, అప్పటికే పాన్ ఇండియా మూవీ గా నిలిచింది  . అయితే ఆ సినిమా వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రభుదేవా డాన్స్ మాస్టర్ గా రాణిస్తున్న ఆ సమయంలో,మొట్టమొదటిగా డైరెక్టర్ గా మారి ఒక సినిమాను చేశాడు. ఆ సినిమా ఏదో కాదు "నువ్వు వస్తానంటే..నేనొద్దంటానా " ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా, ఎమ్మెస్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. కామెడీ అండ్ లవ్ మూవీ గా తెరకెక్కిన ఈ చిత్రం 2005లో విడుదలయ్యింది. అయితే ఈ సినిమా బాలీవుడ్ లో ని "మైనే ప్యార్ కియా "సినిమా స్ఫూర్తిగా తీసుకుని తెరకెక్కించారు.
అయితే ఇందులో సిద్ధార్థ్,  త్రిష, హరికృష్ణ, సునీల్, జయ్ ప్రకాష్ రెడ్డి, తనికెళ్ల భరణి, ప్రకాష్ రాజ్  పాత్రలు అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. జనవరి 14 2005 ఆ సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రానికి మొత్తం 90 ప్రింట్లతో విడుదల చేయగా, ఇక ప్రేక్షకాదరణ బాగా ఉండడంతో ఇంకొన్ని ప్రింట్లను  ఆడ్ చేశారు. 2005వ సంవత్సరంలో అత్యంత భారీ హిట్ చిత్రంగా నిలిచింది. మొత్తం 75 సినీ కేంద్రాలలో 50 రోజులు, 35 కేంద్రాలలో 100 రోజులు ఆడి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఆరు కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం, మొత్తం రూ.18 కోట్లను వసూలు చేసింది. తెలుగులో ప్రేక్షకాదరణ బాగా పొందిన తర్వాత, ఈ సినిమాను మరో తొమ్మిది భాషలలో రీమేక్ చేశారు. అవి తమిళ్,కన్నడ,బెంగాలీ,మణిపురి, ఒడియా, పంజాబీ,బంగ్లాదేశ్, నేపాలీ, హిందీ భాషలలో రీమేక్ చేసి ఒక ప్రభంజనాన్ని సృష్టించారు.
ఇక అంతే కాకుండా ఈ చిత్రం  ఫిలిం ఫేర్ అవార్డ్స్ తో పాటు 5 నంది అవార్డులను కూడా కైవసం చేసుకుంది. ఇక అంతే కాకుండా దక్షిణ భారత చలన చిత్రంలో ఎక్కువ అవార్డులను అందుకున్న చిత్రంగా నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా నిలిచింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: