విజయ్ సేతుపతి మంచి తనాన్ని బయటపెట్టిన వైష్ణవ్ తేజ్...

Purushottham Vinay

కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.అతని నటన గురించి ఎంత ఎక్కువ చెప్పిన తక్కువే అవుతుంది. వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ  మంచి వైవిధ్యమైన నటుడిగా గుర్తింపు తెచ్చుకోని  దూసుకుపోతున్నాడు. ఒక్క సౌత్ లోనే కాదు మొత్తం దేశ వ్యాప్తంగా చాలా మంది అభిమానులని సంపాదించుకున్నాడు. అతని వైవిధ్యమైన నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. తాజాగా విజయ్ మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెన లో నటించాడు. ఉప్పెన సినిమాకు సంబంధించిన ట్రైలర్ లో సేతుపతి టెర్రిఫిక్ పర్ఫామెన్స్ తో మంచి కిక్కివ్వబోతున్నట్లు ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే ఈ టాలెంటెడ్ యాక్టర్ గొప్పతనంపై వైష్ణవ్ తేజ్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చాడు.
వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ.. విజయ్ సేతుపతితో స్క్రీన్ షేర్ చేసుకోవడం నిజంగా నా అదృష్టం. ఆయన ఆఫ్ స్క్రీన్ లో స్టార్ హోదాను ఏ మాత్రం చూపరు. చాలా ఫ్రెండ్లిగా ఉంటారు. ఎదురుపడిన ప్రతి మనిషిని గౌరవిస్తారు.ఆయన నుంచి నటనలోనే కాకుండా గుణంలో కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఉప్పెన షూటింగ్ చివరి రోజు ఆయన అందరిని పేరుపేరున పలకరించారు. సినిమాకు పని చేసిన యూనిట్ సబ్యులకు డిన్నర్ ఇవ్వడమే కాకుండా ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు కూడా ఇచ్చారు.
అంత మంచి మనసున్న వ్యక్తి.. అంటూ వైష్ణవ్ తేజ్ వివరణ ఇచ్చాడు. ఇక ఉప్పెన సినిమా ఈ నెల 12న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ కాంబినేషన్ లో రూపొందిన ఈ సినిమాను సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కించాడు. ఇక సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: