పవన్ కోసం మరో హీరోయిన్ వేటలో పడ్డ క్రిష్...

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలకి విరామం దొరికిన తరువాత  వరుస సినిమాలు అంగీకరిస్తూ దూసుకుపోతున్న  సంగతి తెలిసిందే. ఇటీవలే ‘వకీల్ సాబ్’ సినిమాను పూర్తి చేసిన పవర్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్   ప్రస్తుతం విలక్షణ  దర్శకుడు క్రిష్ సినిమాతో పాటు మలయాళం సినిమా  ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ ను పూర్తి చేసే పనిలో పడ్డాడు. రీసెంట్ గా క్రిష్ సినిమాకి సంబంధించిన రెండో షెడ్యూల్ లో పాల్గొన్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తదుపరి షెడ్యూల్స్ కోసం హైదరాబాద్ లో భారీ సెట్ లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ ని హీరోయిన్ గా ఎంపిక చేసుకోగా.. నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కీలక పాత్ర పోషిస్తుంది.
ఇక ఆసలు విషయానికి వస్తే.. ఈ సినిమాలో మరో హీరోయిన్ కి కూడా చోటు ఉందని తెలుస్తోంది. దానికోసం స్టార్ హీరోయిన్ ను రంగంలోకి దింపాలని చూస్తున్నాడు దర్శకుడు క్రిష్. ఇప్పటికే బాలీవుడ్ లో టాప్ రేసులో దూసుకుపోతున్న ఓ హీరోయిన్ తో సంప్రదింపులు జరిపాడట. అలానే టాలీవుడ్ కి చెందిన ఓ స్టార్ హీరోయిన్ తో కూడా ఈ పాత్రకు సంబంధించి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. నిధి అగర్వాల్, జాక్వెలిన్ లతో పాటు సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉంటుందన్నమాట.
పీరియాడిక్ కథ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటు పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాకి టైటిల్ గా విరూపాక్ష లేదా వీరమల్లు అనే పేర్లు పెట్టే ఛాన్స్ ఉందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ‘హరహర మహాదేవ’ అనే టైటిల్ ను ఫిలిం ఛాంబర్ లో ఖరారు చేయించారట. ఈ టైటిల్ పవన్ సినిమా కోసమనే ప్రచారం సాగుతోంది. భారీ బడ్జెట్ తో ఏఎం రత్నం నిర్మిస్తోన్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: