తనపై వస్తున్న మీమ్స్ పై మొదటిసారి స్పందించిన బ్రహ్మానందం.. ఏమన్నారో తెలుసా.?

praveen
సాధారణంగా సినీ సెలబ్రిటీల పై సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వైరల్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీల కు సంబంధించిన వార్తలు ఏమో కానీ మీమ్స్  అయితే ఎన్నో వస్తూ అటు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. ఇక ఎన్నో రియల్ లైఫ్ సంఘటనలకి ఇక పలు సినిమాల్లో కమెడియన్స్  పెట్టిన హావభావాలను జత చేస్తూ ఎంతోమంది మీమ్స్ తయారు చేస్తూ వినూత్నమైన ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎన్నో రకాల మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. అయితే.. ఎలాంటి సిచువేషన్ అయినా సరే ఇక మీమ్స్ తయారు చేసే వాళ్లకు ముందుగా ఫస్ట్ ఆప్షన్ ఎవరైనా ఉన్నారు అంటే అది హాస్యబ్రహ్మ బ్రహ్మానందం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 నిజ జీవితంలోని ప్రతి సంఘటనకు  కూడా బ్రహ్మానందం ఇచ్చే హావభావాలు సూట్  అవుతూ ఉంటాయి. అందుకే ఎంతోమంది బ్రహ్మానందం పలు సినిమాల్లో చేసిన కామెడీ క్లిప్ లకు సంబంధించిన హావభావాలను కొన్ని  రకాల సంఘటనలకు మీమ్స్ గా పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇక ఇది చూసిన ఎంతోమంది నవ్వుకుంటూ ఉంటారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటివరకు బ్రహ్మానందం ఫొటోస్ తో ఎన్నో రకాల మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయ్ అన్నది  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తనపై వస్తున్న మీమ్స్ గురించి ఇప్పటివరకు బ్రహ్మానందం ఒక్కసారి కూడా స్పందించలేదు.

 ఇటీవలే తన  ఫోటోలతో వస్తున్న మీమ్స్ గురించి స్పందించిన బ్రహ్మానందం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే మీమ్స్ తయారు చేస్తున్న కొంతమంది బ్రహ్మానందం దగ్గరికి వెళ్ళారు..  ఈ క్రమంలోనే వాళ్లతో మాట్లాడిన బ్రహ్మానందం.. నా ఫోటోలు పెట్టి మీమ్స్ తయారు చేస్తూ ఇంకా కోట్ల మంది నవ్విస్తూ ఉన్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. మీరు ఇలాగే చేస్తూ ఉండాలి  నేను సినిమాల్లో మరిన్ని హావభావాలు  మీకోసం ఇస్తూనే ఉంటాను. నేను సినిమాల్లో నవ్విస్తూ ఉంటే మీరు నా ఫోటోలను మీమ్స్ గా పెట్టి నవ్వించండి అందరికీ ఎంటర్టైన్మెంట్ పంచండి అంటూ బ్రహ్మానందం చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: