అనసూయ రెమ్యూనరేషన్ గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.హాట్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తన అందంతో యూత్ ని తనవైపు మలుచుకొని దూసుకుపోతున్న యాంకర్. అనసూయ యాంకర్ కాకముందు  సినిమాలలో చిన్న చిన్న రోల్స్ లో నటించేది..ఆ రోల్స్ తో  పెద్దగా గుర్తింపు రాక.. టీవీల్లోకి వచ్చి స్టార్‌ యాంకర్‌ అయిపోయింది అనసూయ. అందం, అభినయం, సౌందర్య ప్రదర్శన… ఇలా ఎందులోనూ తగ్గకుండా తనదైన శైలిలో జెట్ వేగంతో దూసుకుపోతుంది. ‘జబర్దస్త్‌’ షోతో టీవీల్లో మెరిసి.. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి హాట్‌ బ్యూటీగా నిలిచింది. వయసు పెరుగుతున్న కొద్దీ వన్నె పెరుగుతుంది అని అనసూయను చూస్తే అర్థమవుతుంది అనేలా మెరిసిపోతోంది.ఇక అనసూయ పారితోషికం ఎంత? ఇప్పటిదాకా ఎంత సంపాదించింది… ఆమె ఆస్తుల గురించి చెప్పే ముందు ఆ బ్యాగ్రౌండ్‌ కూడా తెలుసుకోండి...టీవీల్లో సుమ టాప్‌ యాంకర్‌ అని అందరికీ తెలుసు. ఆమె తర్వాత అంతగా సంపాదిస్తున్న యాంకర్‌ అనసూయనేట. ఈ విషయం ఎవరూ అధికారికంగా ధృవీకరించకపోయినా, ఇదే నిజం అంటున్నాయి తెలుగు టీవీ వర్గాలు.
 అన్ని ఛానళ్లలో వరుస షోస్‌ చేస్తూ వస్తున్న అనసూయ బాగానే వెనకేసుకుంటోందట. దాంతోపాటు సినిమాల్లో కూడా చేస్తూ బాగానే సంపాదిస్తోందట.అనసూయకు హైదరాబాద్‌లో రూ. ఎనిమిది కోట్లు విలువ చేసే ఒక ఇల్లు ఉందట. దాంతోపాటు దాదాపు మూడు కోట్ల రూపాయలు విలువ చేసే రెండు కార్లు కూడా ఉన్నాయి. ఇవి కాకుండా మరిన్ని ఆస్తులు కూడా ఉన్నాయని సమాచారం. ఆమె ఏటా 2.5 నుండి 3.5 కోట్ల వరకు సంపాదిస్తోందట. అనసూయ ప్రస్తుతం రవితేజ ‘ఖిలాడీ’, కృష్ణవంశీ ‘రంగమార్తాండ’లో కనిపిస్తోంది.
వీటితోపాటు తమిళంలో విజయ్‌సేతుపతితో ఓ సినిమాలో నటిస్తోంది. ఇవి కాకుండా సునీల్ హీరోగా తెరకెక్కబోయే సినిమాలో అనసూయ హీరోయిన్ గా నటిస్తోందని సమాచారం అందుతుంది. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: