మద్యం మత్తులో కోయిలమ్మ సీరియల్ నటుడు దౌర్జన్యం

kalpana
బుల్లితెర కోయిలమ్మ సీరియల్ నటుడు సమీర్ అలియాస్ అమర్ గత రాత్రి మద్యం మత్తులో పెద్ద హంగామా చేశాడు. ఈ నేపథ్యంలోనే మద్యం తాగిన మత్తులో ఉన్న సమీర్ మణికొండలో ఒంటరిగా నివసించే అమ్మాయిలపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. దీంతో ఆ మహిళలు పోలీసులను ఆశ్రయించి అతని నుంచి మాకు ప్రాణహాని ఉందంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఘటన తాజాగా చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...                                                      
కోయిలమ్మ సీరియల్ లో నటించిన నటుడు సమీర్ మద్యం మత్తులో ఒంటరిగా ఉన్న శ్రీవిద్య, అపర్ణ అనే మహిళలపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. అతనితో పాటు అతని గర్ల్ ఫ్రెండ్ మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నట్లు ఆ మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ మహిళలు ఇద్దరు కొద్ది రోజుల క్రితం నుంచి మణికొండలో బోటిక్ నిర్వహిస్తూ వ్యాపారం చేసుకుంటున్నారు. వారి దగ్గర నుంచి 5 లక్షల రూపాయల నగదును తీసుకున్న సమీర్, సదరు మహిళలు డబ్బులు అడిగితే రౌడీయిజం చేస్తున్నారంటూ... ఆ మహిళలు స్థానిక రాయదుర్గం పోలీస్ స్టేషన్లు సమీర్ పై ఫిర్యాదు చేశారు.
స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అపర్ణ,శ్రీవిద్య అనే మహిళలు మాకు నటుడు సమీర్ నుంచి ప్రాణహాని ఉందని, మాకు రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకున్నారు. దీనిపై స్పందించిన పోలీసులు నటుడు సమీర్ పై ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసుకొని మహిళలకు రక్షణ కల్పిస్తున్నారు. ఈ విషయంపై సమీర్ స్పందిస్తూ... నాపై ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. నిజానిజాలు తెలుసుకోకుండా ఈ విధంగా మాట్లాడటం సరికాదని

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: