ఇలా అయితే పూజ పరిస్థితి కూడా ఇలియానా లో అవుతుందట....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..దీపం  ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనేది మన  పెద్దలు చెప్పిన సామెత . ఈ మాటను ఎవరు పాటించిన పాటించకపోయినా  మన హీరోయిన్లు చక్కగా అర్థం చేసుకుంటున్నారు. పక్కాగా పాటిస్తారు. అందుకే మంచి ఫేమ్ ఇంకా మంచి క్రేజ్‌ ఉండగానే.. ఎక్కువ పైసలు వసూలు డిమాండ్ చేస్తున్నారు.వారి రెమ్యూనరేషన్ భారీగా పెంచుస్తున్నారు. ఎంతగా అంటే 20 నిమిషాల పాత్రకు కోటి రూపాయలు తీసుకునేంత డిమాండ్ చేస్తున్నారు ఈ హాట్ బ్యూటీలు . అవును ‘ఆచార్య’ సినిమాలో పూజా హెగ్డే పాత్ర గురించే ఇదంతా. ఈ సినిమా పూజ కీలక పాత్రలో నటిస్తోందనే విషయం తెలిసిందే. రామ్‌ చరణ్‌కు జోడీగా కనిపించబోతోంది. ఈ పాత్ర కోసం పూజ షాకింగ్‌ రెమ్యూనరేషన్‌ డిమాండ్‌ చేసిందట. ఆమె క్రేజ్‌ దృష్ట్యా చిత్రబృందం ఆ డీల్‌కు ఓకే చెప్పిందట.

పూజా హెగ్డే హవా ప్రస్తుతం టాలీవుడ్‌లో మాములుగా నడుస్తలేదు.ఇక ఈమను మించిన అందగత్తె దొరకదని డబ్బులు విపరీతంగా పొసేస్తున్నారు మన టాలీవుడ్ నిర్మాతలు. అందుకే అది క్యాష్ చేసుకోని ఈ హాట్ బ్యూటీ  వరుస సినిమాలు ఓకే చేసుకుంటూ వెళ్లిపోతోంది. అలా ‘ఆచార్య’లో రామ్‌ చరణ్‌ సరసన నటించబోతోంది. ఈ పాత్ర కోసం చాలామందిని అనుకున్నా.. ఆఖరుకు పూజను ఓకే చేసింది చిత్రబృందం. అయితే దీని కోసం ఆమె కోటి రూపాయలు వసూలు చేస్తోందట. సినిమాలో ఆమె పాత్ర నిడివి 20 నిమిషాలే ఉండబోతోంది.


అంటే ఒక్కో నిమిషానికి ఆమెకు  ఐదు లక్షల రూపాయలు చెల్లించి మరి తీసుకుంటున్నారట.‘స్టార్‌ హీరోయిన్ గా జోరు చూపిస్తున్న సమయంలో ఇలా తక్కువ నిడివి ఉన్న పాత్రలు ఎంచుకోవడం ఏంటో’ అని అందరూ అనుకుంటున్న సమయంలో కోటి రూపాయల మాట విని.. అదన్నమాట సంగతి అనుకుంటున్నారు. ఇంత దారుణంగా వసూలు చేస్తే ఈమె పరిస్థితి భవిష్యత్తులో ఇలియానా లా అవ్వడం ఖాయమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: