హిట్టు పడ్డది రేటు పెంచేసిన మాస్ రాజా..!

shami
మాస్ మహరాజ్ రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వచ్చిన క్రాక్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. సంక్రాంతి కానునగా వచ్చిన ఈ సినిమా మరోసారి రవితేజ స్టామినా ఏంటన్నది ప్రూవ్ చేసింది. రాజా ది గ్రేట్ తర్వాత హిట్టు కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్న రవితేజ క్రాక్ తో సెన్సేషనల్ హిట్ కొట్టాడు. ఇక హిట్టు పడ్డదో లేదో రెమ్యునరేషన్ కూడా పెంచేసినట్టు తెలుస్తుంది.
రవితేజతో సినిమాలు కొన్ని రెమ్యునరేషన్ వల్లే సినిమాలు క్యాన్సిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇక ఇప్పుడు రవితేజ అడిగినంత ఇచ్చి మరి సినిమాలు చేస్తారని చెప్పొచ్చు. సరైన సినిమా పడితే రవితేజ సినిమా వసూళ్లు ఎలా ఉంటాయన్నది క్రాక్ ప్రూవ్ చేసింది. అందుకే క్రాక్ తర్వాత రవితేజ రెట్టింపు ఉత్సాహంతో పాటుగా రెమ్యునరేషన్ ను కూడా పెంచాడని తెలుస్తుంది. ఇంతకుముందు 12 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకున్న రవితేజ ఇక మీదట 15, 16 కోట్ల దాకా డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంద్.
రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ఖిలాడి టైటిల్ ఫిక్స్ చేశారు. సినిమా ఫస్ట్ లుక్ టీజర్ మాస్ రాజా బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మొత్తానికి రవితేజ హిట్టు కొట్టిన ఉత్సాహంతో మునుపటి జోష్ తో కనబడుతున్నాడు. అంతేకాదు వరుస సినిమాలు చేస్తున్నాడని తెలుస్తుంది. రవితేజతో సినిమా కోసం దర్శక నిర్మాతలు కూడా ఇంట్రెస్ట్ గా ఉన్నారు. కొన్నాళ్లుగా డిస్కషన్స్ లో ఉన్న విక్రం వేద రీమేక్ లో కూడా రవితేజ నటిస్తున్నాడని టాక్.                              
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: