13 వ రోజు కూడా మంచి వసూళ్లతో అదరగొట్టిన రెడ్...

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రస్తుతం మంచి ఫాంలో వున్నాడని చెప్పాలి. వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ఒకే జోనర్ లో సినిమాలు తియ్యకుండా డిఫరెంట్ జోనర్లలో మూవీ లు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్. ఇక రామ్ నటించిన  తాజా సినిమా  ‘రెడ్’ 13వ రోజున కూడా అదరగొట్టింది. ‘హలో గురు ప్రేమ కోసమే’ ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో మంచి  ఫామ్లో వున్నాడు ఎనర్జిటిక్ హీరో రామ్. ఇక వరుస హిట్ల మీద వున్న  రామ్ నటించిన తాజా సినిమా "రెడ్"  సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదలైంది. మాళవికా శర్మ, నివేదా పేతురాజ్, అమృతా అయ్యర్ వంటి హాట్ బ్యూటీలు  ఈ సినిమాలో  హీరోయిన్లుగా నటించారు.కెరీర్ లో మొదటిసారి రామ్ డబుల్ రోల్ ప్లే చేసిన సినిమా ఇది.కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ‘శ్రీ స్రవంతి మూవీస్’ పతాకం పై ‘స్రవంతి’ రవి కిషోర్ నిర్మించారు.’రెడ్’ సినిమాకి మొదటిరోజు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ..రామ్ కు ఉన్న క్రేజ్ వల్ల మంచి కలెక్షన్లనే వసూలు చేసింది.

ఇక తాజా వసూళ్ల విషయానికి వస్తే ‘రెడ్’ సినిమాకి  15.7కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. 13 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 19.53 కోట్ల షేర్ ను వసూలు చేసి క్లీన్ హిట్ అనిపించుకుంది.దాంతో ఈ చిత్రం కొన్న బయ్యర్లకు 3.83 కోట్ల వరకూ లాభాలు దక్కినట్టు సమాచారం అందింది. నిన్న రిపబ్లిక్ డే సెలవు రోజున కూడా ఈ చిత్రం 0.20 కోట్ల షేర్ ను వసూలు చేసింది రెడ్ సినిమా.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన   మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన   విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: