పచ్చని కాపురంలో చిచ్చు పెట్టిన మంచు వారి హీరోయిన్..ఆమె కారణంగానే విడాకులు..?

P.Nishanth Kumar
సినిమా ఇండస్ట్రీ లో విభేదాలు వచ్చి విడిపోయిన వారు చాలా మందే ఉన్నారు.. అభిప్రాయ భేదాలు, ఈగోలు, వగైరా వగైరా వంటివి ఇద్దరి మధ్య తలెత్తి చివరికి వారి మధ్య దూరం పెరిగిపోయి అది విడాకులకు దారితీస్తుంది.. ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ వల్ల సినిమా ఇండస్ట్రీ లో ఇంకా ఎక్కువగా ఇలాంటి పరిణామాలు జరుగుతుంటాయి. అయితే దానికి ఒకరిద్దరు అని కారణం ఉండదు.. ఎవరికీ వారే దానికి కారణం అవుతుంటారు. కానీ కొంతమంది ఆ ఆరోపణలను ఇతరుల మీద వేసి తమది ఏం తప్పులేదని చెప్పడానికి ప్రయత్నిస్తుంటారు..
ఇదిలా ఉంటే ఇటీవలే బాలీవుడ్ హీరో ఇమ్రాన్ ఖాన్ తన భార్య అవంతిక నుండి విడాకులు కోరిన సంగతి తెలిసిందే. అయితే ఈ విడాకులు కోరడానికి కారణం ఓ హీరోయిన్ అని ఆరోపణలు బయటకి వస్తున్నాయి.. లేఖ వాషింగ్టన్.. వేదం చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఇమ్రాన్ ఖాన్ తన భార్య నుంచి విడిపోవడానికి కారణమని బాలీవుడ్ కోడై కూస్తుంది. ఈమెతో ఉన్న ఎఫైర్ కారణంగానే ఇమ్రాన్ ఖాన్ తన భార్యని వదిలేస్తున్నాడట. నిజానికి లేఖకు కూడా వివాహం జరిగింది.
ఆమె భర్త పాబ్లో ఛటర్జీ, ఇమ్రాన్ ఖాన్ మంచి స్నేహితులు. అలా ఇమ్రాన్ తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం తెలిసి ఇమ్రాన్ భార్య అవంతిక అతడితో డివోర్స్ కి రెడీ అయిందని సమాచారం.లేఖ కూడా తన భర్తతో విడాకులు తీసుకొని ఇమ్రాన్ తో సెటిల్ అవ్వాలని అనుకుంటుందట. ఇప్పటికే ఇమ్రాన్ తన క్లోజ్ సర్కిల్ లో ఉన్నవాళ్లందరికీ లేఖను పరిచయం చేస్తున్నాడట. అంతేకాదు.. వీరిద్దరూ కలిసి ఉండడానికి సెపరేట్ గా ఓ ఇల్లు కూడా తీసుకున్నాడని తెలుస్తోంది. విడాకులు కన్ఫర్మ్ అయిన వెంటనే లేఖతో ఉన్న బంధాన్ని అఫీషియల్ గా చెప్పాలని భావిస్తున్నాడట.. ఇక లేఖ తెలుగులో వేదం సినిమాలో నటించగాఈ సినిమా లో మంచు మనోజ్ సరసన నటించారు.. ఆ తర్వాత అవకాశాలు లేక ఆమె హీరోయిన్ గా చేయడం మానేసి పెళ్లి చేసుకుంది.. మళ్ళీ ఇప్పుడు ఆమె వార్తల్లో నిలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: