షాకింగ్ : ఆ బాధ్యతలు భార్యకు అప్పగించి తప్పుకున్న దిల్ రాజు !

Chaganti
టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత గా కొనసాగుతున్న దిల్ రాజు ఈ మధ్య కాలంలోనే పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడు అయ్యాడు. నిజానికి దిల్ రాజు మొదటి భార్య అనిత హార్ట్ ఎటాక్ తో మరణించడంతో ఆయన తేజస్విని అనే యువతిని వివాహమాడాడు. అనంతరం శాస్త్రోక్తంగా ఆమె పేరును వైఘా రెడ్డిగా మార్చుకున్నాడు. ఒకరకంగా సినిమా కథ విని దానిని బేరీజు వేయడంలో దిల్ రాజుది అందెవేసిన చేయి. చాలామంది దర్శక నిర్మాతలు తమ సినిమా కథలను ముందుగా దిల్ రాజుకు వినిపించి ఆయన అభిప్రాయం ప్రకారం ఓకే అనిపిస్తేనే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెడతారు. 

అయితే అదేమీ లేదని దిల్ రాజు కొట్టిపారేస్తారు, ఎందుకంటే తనకు అలాంటి శక్తి ఉంటే తనకు ఎందుకు ఫ్లాప్ మూవీస్ వస్తాయి అనేది ఆయన వాదన. కానీ దిల్ రాజు ఊ అంటేనే సినిమా తీసే నిర్మాతలు చాలామంది ఉన్నారని టాలీవుడ్లో బహిరంగ రహస్యం. ఇక దిల్ రాజు కాంపౌండ్ ఎప్పుడు స్టోరీ డిస్కషన్స్ తో కళకళ లాడుతూ ఉంటుంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ స్టోరీ డిస్కషన్స్ వ్యవహారం నుంచి దిల్ రాజు తప్పుకునే యోచనలో ఉన్నాడట.

 ఎందుకంటే దిల్ రాజు భార్య రైటింగ్ స్కిల్స్ ఉన్న క్రియేటివ్ పర్సన్ కావడంతో సినిమా స్క్రిప్ట్ ను జడ్జ్ చేసే బాధ్యత ఇప్పుడు దిల్ రాజు తన భార్య వైఘాకు అప్పగించారట. అంతా బాగానే ఉంది కానీ సదరు వైఘాకు తెలుగు భాష రాదట. సో ఇకమీదట వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో సినిమాలు చేయాలనే దర్శకులు స్క్రిప్ట్ అంతా ఇంగ్లీష్ లోనే రాసుకోవాలని చెబుతున్నారు. ఆమె కధ అంతా చదివి ఆమెకు నచ్చితేనే దిల్ రాజు వద్దకు కధ పంపిస్తారట. ఆ తర్వాత దిల్ రాజు జడ్జ్ చేసి సినిమాను ఫైనల్ చేస్తారన్నమాట. ఒక రకంగా భార్య అంటే భర్తలో సగం అని అంటారు, ఇప్పుడు దిల్ రాజు భార్య కూడా భర్త బాధ్యతలు పంచుకుంటూ టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: