"ఎఫ్ 3" లో మరొక మెగాహీరో అంటూ గాసిప్స్..!!
చాలా రోజుల తర్వాత వెంకటేష్ నుండి పర్ఫెక్ట్ కామెడీని ఈ సినిమా ద్వారానే చూపించారు అనిల్ రావిపూడి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఈ సినిమాతోనే కామెడీ జోనర్ ను ట్రై చేసి మంచి పేరునే తెచ్చుకున్నాడు. అలాంటి ఈ సినిమాకు సీక్వల్ గా "ఎఫ్3" ఉంటుందని ఎఫ్2 చిత్రంలోనే అధికారికంగా ప్రకటించాడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం దాని సీక్వెల్ ఎఫ్3 తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు ఈ టాలెంటెడ్ దర్శకుడు . "ఎఫ్3" వెంకటేష్, వరుణ్ తేజ్ లతో పాటుగా మరొక కథానాయకుడు నటిస్తాడని ఎప్పటి నుండో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈమధ్య షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రం గురించి అనిల్ రావిపూడి పలు సందర్భాలలో మాట్లాడినప్పటికీ మరొక పాత్ర గురించి సమాచారం ఇవ్వలేదు. అయినప్పటికీ రూమర్స్ ఆగడం లేదు.
ప్రస్తుతం వస్తున్నా రూమర్స్ ప్రకారం ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ ఉందని ప్రీక్లైమాక్స్ లో వచ్చే ఆ పాత్ర పూర్తీ కన్ ఫ్యూజన్ తో సాగుతూ ఫుల్ గా నవ్విస్తోందని.. ఇద్దరి హీరోలను ఫుల్ గా ఇరకాటంలో పెట్టే ఆ పాత్రలో సాయి ధరమ్ తేజ్ నటించబోతున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజం అన్నది ఇది అధికారిక ప్రకటన వస్తే గాని తెలియదు.కాగా ఇప్పటికే ‘ఎఫ్ 3’ కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే, డబ్బులతో నింపిన ట్రాలీలను నెట్టు కెళుతున్న వెంకటేష్, వరుణ్ లుక్ ఆసక్తి రేపగా… ఇది డబ్బులు చుట్టూ నడిచే కామెడీ డ్రామా అని డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇదివరకే తెలిపారు. ప్రస్తుతం వెంక్కీ ‘నారప్ప’ సినిమా చేస్తున్నాడు, వరుణ్ తేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో "గాని" అనే చిత్రం చేస్తున్నారు.