ప్చ్... ప్రభాస్ ఇంత డిజప్పాయింట్ చేస్తాడని ఊహించలేదే...!
ఆ తర్వాత మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్ సినిమా చేస్తున్నాడు. ఇది కూడా భారీ బడ్జెట్ మూవీ అన్న సంగతి తెలిసిందే. ఇక కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో చేసే సినిమాను హోంబలే ఫిలింస్ వారు నిర్మిస్తున్నారు. వీళ్లు కేజీయఫ్ మేకర్స్ అన్న విషయం తెలిసిందే. సాలార్ టైటిల్ తో తెరకెక్కే ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో భారీ స్థాయిలో నిర్మాణం జరపుకోనుంది. ఇక బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించే ఆదిపురుష్ సినిమాలోనూ ప్రభాస్ మెయిన్ రోల్ లో నటిస్తున్నాడు.
అసలు ఈ పాన్ ఇండియా ప్రాజెక్టుల తర్వాత ప్రభాస్ దేశంలోనే తిరుగులేని స్టార్ హీరో అవుతాడన్న అంచనాలు విపరీతంగా ఉన్నాయి. ప్రభాస్ సినిమాల గురించి ఇంత హడావిడి నడుస్తున్నా తాజా చిత్రం రాధే శ్యామ్ గురించి మాత్రం బయటకు ఎలాంటి అప్‌డేట్ రాలేదు. ఈ సంక్రాంతికి చాలా సినిమాల పోస్టర్లు.. టీజర్ల హడావిడి నడిచింది. వీటితో పోలిస్తే రాధే శ్యామ్ షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయినా టీజర్ ఇప్పటకి బయటకు రాలేదు.
దీంతో అసలు సినిమా ఎక్కడ ఉందో ఏంటో ? తెలియని గందరగోళం నెలకొంది. సాహో వచ్చి యేడాదిన్నరకు పైగానే అయ్యింది. ఇప్పటకీ ప్రభాస్ సినిమా లేకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్రంగా నిరుత్సాహ పడుతున్నారు.