కందిరీగ హ్యాంగ్ ఓవర్ నుంచి ఇంకా బయటకి రాలేదా..?
ఈ సంక్రాంతి కి టాలీవుడ్ నుంచి నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డ సంగతి తెలిసిందే.. అందులో ఒకటి బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన అల్లుడు అదుర్స్ సినిమా.. రిలీజ్ కు ముందు యూనిట్ చెప్పిన చెప్పిందంతా గొప్పగా రిలీజ్ అయ్యాక లేదు.. సినిమాలో అస్సలు విషయం లేదని సినిమా చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఇంత అవుట్ డేటెడ్ కథతో కోట్లు ఖర్చు పెట్టేలా నిర్మాతను ఎలా ఒప్పించారన్న దాని మీదే ఎక్కువ చర్చ జరుగుతోంది.
బెల్లంకొండ శ్రీనివాస్ తండ్రి అయిన బెల్లంకొండ సురేష్ తన కొడుకుని కందిరీగ లాంటి సినిమాలో చూడాలని చెప్పుకొచ్చారు..ఆ కోరిక ఈ సినిమా తో తీరిందని పదే పదే చెప్పడం చూస్తే దాన్నే మళ్ళీ తీశారా అన్న డౌట్ వస్తుంది. చూడబోతే కందిరీగ హ్యాంగ్ ఓవర్ నుంచి దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఇంకా బయటకి రాలేదని ఈ సినిమా చూసి చెప్పొచ్చు. అసలే సంతోష్ శ్రీనివాస్ బాలకృష్ణతో ఓ సినిమా చేసేందుకు ప్లానింగ్ లో ఉన్నాడు. ఆల్రెడీ ఓ డిస్కషన్ కూడా జరిగిందట. ఇప్పుడీ తాజా ఫలితం చూసి బాలయ్య మనసు మార్చుకుంటారా లేక అవేవి పట్టించుకోకుండా గతంలోలాగే ఓకే చెప్పేస్తారా అనేది వేచి చూడాలి.