ప్చ్.. పవన్ తో రొమాన్స్ చేయడానికి ఆ హీరోయిన్ ఎందుకు డేట్స్ అడ్జెస్ట్ చేయట్లేదబ్బా?

savitri shivaleela
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మలయాళంలో మాంచి హిట్ ను అందుకున్న అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ మూవీని వీలైనంత తొందరలోనే తెరకెక్కించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. సంక్రాంతి తర్వాత ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళతామని ఆ చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. పింక్ రీమేక్ ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసుకున్న పవన్ ఈ సినిమాను తొందర తొందరగా తెరకెక్కించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ సినిమా ముగియడంతో వపన్ కు చాలా సినిమాలే క్యూలో ఉన్నాయి. అందులో డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడితో విరూపాక్ష సినిమాను కూడా తెరకెక్కించాల్సి ఉంది. కాగా ఈ సినిమా డైరెక్టర్ గత కొంత కాలం కిందట కరోనా భారిన పడిన సంగతి తెలిసిందే. కాగా ఈ మధ్యనే కరోనా నుంచి బయటపడటంతో పవన్ తో చారిత్రాత్మక సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు డైరెక్టర్ క్రిష్.
అయితే ఈ సినిమా కోసం పవన్ కేవలం నలబై రోజులే టైం ఇచ్చినట్టు సినీ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే వీలైనంత తొందరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ సాగర్ కే. చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే పవన్ మలయాళం మూవీ అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ మూవీని కూడా అతి తొందరలోనే తెరకెక్కించే పనిలో పడినట్టు తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి లతో మల్టీస్టారర్ మూవీగా ఇది తెరకెక్కుతోంది. కాగా ఈ సినిమాలో పవన్, రానా దగ్గుపాటిలు ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. అయితే ఇప్పటికే ఈ హీరోల సరసన ఏయే హీరోయిన్లు నటిస్తున్నారన్న విషయం తెలిసిందే.
రానా దగ్గుపాటి సరసన ఐశ్వర్యరాజేశ్ నటిస్తుండగా, పవన్ సరసన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి నటిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఈ బ్యూటీకి ఇప్పటికే చాలా సినిమాలు చేతిలో ఉన్నాయి. ఆ సినిమా షూటింగ్ లో ఈ చిన్నది ఫుల్ బిజీగా ఉన్నారు. కాగా ఇప్పడు పవన్ సినిమా కోసం టైం కేటాయిస్తుందో లేదో నన్న అనుమానం మొదలైంది. అలాగే ఈ ముద్దుగుమ్మడి షెడ్యూల్ ఫుల్ బిజీగా ఉండటంతో ఈ సినిమాకు టైం కేటాయించే అవకాశమే లేదని సినీ ఇండస్ట్రీలో గుసగుసలు మొదలయ్యాయి.ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఈ సినిమా డేట్స్ కు సంబంధించి విషయాలపై ఈ చిన్నదాని నుంచి ఏ రెస్పాన్స్ రాలేదట. కాగా ఈ సినిమా షూటింగ్ మొదలయ్యేలోపన్నా సాయి పల్లవి ఏదో ఒక విషయం చెప్తే బాగుంటుంది అనుకుంటున్నారట ఈ చిత్ర మేకర్స్. చూడాలి మరి సాయి పల్లవి డేట్స్ ను ఏవిధంగా కుదుర్చుకుంటుందనేది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: