చిన్నప్పుడే బాగా నటించారట ! ఈనాటి స్టార్ హీరోయిన్స్ !

kalpana
తెలుగు సినీ ప్రపంచంలో ఎందరో హీరోయిన్లు వెండితెరకు పరిచయమై తమ విభిన్న నటనా అభినయంతో  ప్రేక్షకాదరణ పొందారు. అలాంటి వారిలో కొందరు మొదట చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ తమ నటనకు పదును పెడుతూ స్టార్ హోదా పొందిన హీరోయిన్లు ఉన్నారు. కొందరైతే చిన్న వయసులోనే సినీ రంగ ప్రవేశం చేసి ఇ బాల్య నటులుగా గుర్తింపు పొంది తర్వాత అగ్ర హీరోయిన్లుగా సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వారి గురించి తెలుసు ఉన్నప్పుడు వారికి నటనపై ఎంత మక్కువ ఉందో అర్థమవుతుంది .అలాంటి  కొందరు హీరోయిన్ల గురించి తెలుసుకుందాం!
కీర్తి సురేష్ :
కీర్తి సురేష్ మొదట బాలనటిగా  “పైలెట్స్” అనే మలయాళ మూవీలో పరిచయమైంది . తర్వాత "అచనయికిస్టం", "కుబేరన్" అనే మలయాళ మూవీస్ లో కూడా బాలనటిగానే మంచి గుర్తింపు తెచ్చుకుంది.
తెలుగులో  “నేను శైలజ”  అనే మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయమై, తెలుగు ప్రజలను ఆకట్టుకుంది. తరువాత  సావిత్రి గారి బయోపిక్ తో వచ్చిన ”మహానటి” సినిమా  విషయంతో కీర్తి సురేష్ కి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు లభించింది.
నిత్యామీనన్:
టాలీవుడ్ లో  నాని హీరోగా “అలా మొదలైంది” సినిమాతో  తెలుగు తెరకు పరిచయం అయినా నిత్యామీనన్ ఆ సినిమా విజయంతో తర్వాత వచ్చిన "ఇష్క్ "," గుండెజారి గల్లంతయ్యిందే " సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో తెలుగు హీరోయిన్ గా స్టార్ట్ హోదా లభించింది. మలయాళం నటి అయినప్పటికీ, నిత్యా తెలుగు అమ్మాయి పాత్రలో అచ్చం గా ఇమిడిపోతుంది. నిత్య మీనన్ కూడా బాలనటిగా “ద మనీ హు నో టూ మచ్ ” అనే సినిమాలో నటించి మెప్పించింది.
అంకిత:
మన చిన్నప్పుడు రస్నా యాడ్ ఎంత ఫేమస్ మనకు తెలుసు ఆ యాడ్లో బాలనటిగా నటించింది  అంకిత. ఈ క్యూట్  హీరోయిన్ అంకిత తెలుగులో మొదటగా "సింహాద్రి” సినిమా లో చీమ చీమ పాట లో ఎన్టీఆర్ తో కలిసి స్టెప్పులేసిన తర్వాత “లాహిరి లాహిరి లాహిరిలో' అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది.
హన్సిక:
చిన్న వయసు లోనే వెండితెర కు పరిచయం అయినా హీరోయిన్లలో హన్సిక ఒకరు . ” దేశ ముదురు” సినిమా తో హన్సిక హీరోయిన్ గా పరిచయం అయ్యారు. అప్పటికి ఆమె వయసు 19 సంవత్సరాలే. కానీ, అంతకుముందే హన్సిక హృతిక్ రోషన్ తో కలిసి "కోయీ మిల్ గయా ” అనే సినిమా లో బాలనటి గా మెప్పించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: