వడ్డే నవీన్ సతీమణి ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Divya

తెలుగు సినీ ఇండస్ట్రీలో కొంత మంది హీరో హీరోయిన్లు ఎటువంటి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా, అగ్ర నటుడిగా కొన్ని దశాబ్దాల నుండి కొనసాగుతున్నారు. మరికొంత మంది ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చి స్టార్స్  అవుతున్నారు. ఇంకొంత మంది ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకొని, అకస్మాత్తుగా సినీ ఇండస్ట్రీ కి దూరం అవుతుంటారు. అలాంటి వారికి చెందినవాడే  వడ్డే నవీన్. ప్రముఖ సినీ నిర్మాత వడ్డే రమేష్ గారి తనయుడు వడ్డే నవీన్.

"కోరుకున్న ప్రియుడు" అనే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేశాడు వడ్డే నవీన్. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినప్పటికీ, వడ్డే నవీన్ కు మాత్రం మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిందనే చెప్పవచ్చు.  ఆ తరువాత" పెళ్లి" సినిమాలో నటించి, తన కెరియర్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ను అందుకున్నాడు. ఆ తరువాత అతి తక్కువ కాలంలోనే మనసిచ్చి చూడు, మా బాలాజీ,ప్రేమించే మనసు తో పాటూ  చాలా బాగుంది అంటూ మొత్తం 28 సినిమాల్లో హీరోగా నటించాడు. అతి తక్కువ కాలంలోనే గొప్ప స్టార్డంను సొంతం చేసుకున్న వ్యక్తిగా వడ్డే నవీన్ పేరు సంపాదించుకున్నాడు.

సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కును సృష్టించుకున్న వడ్డే నవీన్, ఇక ఆ మార్క్ ను కొనసాగించడంలో మాత్రం విఫలమయ్యాడు.  ఆ తర్వాత ఒకటి, రెండు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా పనిచేశాడు. హీరోగా అంత మంచి పేరు తెచ్చుకున్న వడ్డే నవీన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మాత్రం రాణించలేకపోయాడు. ఇక తన వ్యక్తిగత జీవితానికి వస్తే వడ్డే నవీన్ పెళ్లాడిన అమ్మాయి ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

వడ్డే నవీన్  స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి కుమారుడైన రామకృష్ణ కూతురు చాముండేశ్వరిని  పెళ్లాడాడు. వడ్డే నవీన్ తండ్రి వడ్డే రమేష్ కి నందమూరి కుటుంబానికి ముందు నుండి  మంచి సాన్నిహిత్యం ఉండేది. ఈ సాన్నిహిత్యం కారణంగానే  వీరిద్దరి పెళ్లి కుదిరింది. కానీ కొన్ని కారణాల చేత వీరిద్దరు విడిపోవాల్సి వచ్చింది. ఈ కారణం చేతే వడ్డే నవీన్ సినీ ఇండస్ట్రీలో రాణించలేకపోయాడు అని కొన్ని వార్తలు కూడా వినిపించాయి. అయితే ఒక ఇంటర్వ్యూలో వడ్డే నవీన్ మాట్లాడుతూ" నేను ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకొని,మా సంసార జీవితంలో సంతోషంగానే ఉంటున్నామంటూ " వడ్డే నవీన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: