బిగ్ బాస్ హారికకు భలే ఛాన్స్..!

shami
బిగ్ బాస్ సీజన్ 4లో తన టాలెంట్ చూపించి టాప్ 5లో నిలిచింది దేత్తడి హారిక. గ్లామర్ షో విషయంలో కూడా హారిక ఏమాత్రం తగ్గలేదని చెప్పొచ్చు. వైరల్లీ వీడియోస్ తో హారిక క్రేజ్ తెచ్చుకోగా బిగ్ బాస్ హౌజ్ లో తన పాపులారిటీ డబుల్ చేసుకుంది హారిక. ఇక బిగ్ బాస్ తర్వాత దాదాపు అందరికి మంచి అవకాశాలే వస్తుండగా హారికకు యువ హీరో శర్వానంద్ సినిమాలో ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది.
శర్వానంద్ హీరోగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో కిశోర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న సినిమా శ్రీకారం. ఈ సినిమాలో హీరోయిన్ గా నాని గ్యాంగ్ లీడర్ భామ ప్రియాంకా అరుల్ మోహన్ నటిస్తుండగా సినిమాలో హారికకు ఒక మంచి రోల్ దక్కిందని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 4 నుండి బయటకు రాగానే హారికకు మంచి ఛాన్స్ వచ్చిందట. అవకాశం రావడమే ఆలస్యం ఆమె ఆ పాత్రలో నటిస్తానని చెప్పిందట. బిగ్ బాస్ సీజన్ 4 లో చివరి వరకు ఉన్న హారిక 40 లక్షల దాకా రెమ్యునరేషన్ అందుకుందని టాక్.
తన గ్లామర్ షోకి బిగ్ బాస్ నిర్వాహకులు ఎక్కువ ఇచ్చారని టాక్. ఏది ఏమైనా బిగ్ బాస్ ఇప్పటివరకు జరిగిన నాలుగు సీజన్లలో ముందు మూడు సీజన్ల కంటెస్టంట్స్ కన్నా ఈ సీజన్ కంటెస్టంట్స్ ఎక్కువ ఆఫర్లు తెచ్చుకున్నారని తెలుస్తుంది. విన్నర్ అభిజిత్, రన్నర్ అఖిల్, థర్డ్ ప్లేస్ లో ఉన్న సోహెల్, నాల్గవ స్థానంలో అరియానా, ఫిఫ్త్ ఫైనలిస్ట్ హారిక, ఈ సీజన్ క్రేజీ కంటెస్టంట్ మోనాల్, మెహబూబ్ ఇలా అందరికి మంచి అవకాశాలు వచ్చినట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: