మెగా డాటర్ నిహారిక కు ఊహించని షాక్.. నిలిచిపోయిన వెబ్ సిరీస్ షూటింగ్..?
ఇక పెళ్లి తర్వాత తన భర్తతో హనీమూన్కి మాల్దీవులకు వెళ్ళింది నిహారిక. ఇకపోతే పెళ్లికి ముందు సినిమాలో వెండితెరపై నటించి మెగా అభిమానులు అందరినీ అలరించిన నిహారిక పెళ్లి తర్వాత మళ్లీ ముఖానికి మేకప్ వేసుకుంటుందా లేదా అనే డౌట్ అటు అభిమానులు అందరిలో నెలకొంది. ఇటీవలే డౌట్స్ అన్నిటికి చెక్ పెడుతూ వెబ్ సిరీస్ చేస్తున్నాను అంటూ చెప్పింది నిహారిక. ఇక నిహారిక నటిస్తున్న వెబ్ సిరీస్ పూజా కార్యక్రమం కూడా పూర్తి చేసుకుంది. ఇక ఈ వెబ్ సిరీస్ లో జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా కీలక పాత్రలో నటిస్తోంది.
అయితే ఇటీవలే అనసూయ మెగా డాటర్ నిహారిక కు భారీ షాక్ ఇచ్చింది. అనసూయ నిన్న వెబ్ సిరీస్ షూటింగ్లో పాల్గొనాల్సి ఉంది ముఖ్యంగా అనసూయ నిహారిక మధ్య ఉండే కీలక సీన్స్ చిత్రీకరించాలని అటు చిత్రబృందం భావించిందట.. కానీ తనకు కరోనా లక్షణాలు ఉన్నాయి అని చెప్పి షూటింగ్ క్యాన్సిల్ చేసుకుందట జబర్దస్త్ యాంకర్ అనసూయ. అంతేకాదు తనను కలిసిన వాళ్లు వెంటనే కరోనా పరీక్షలు చేసుకోవాలి అంటూ సూచించింది. ఇక అనసూయ కరోనా వైరస్ బారిన పడడంతో అర్థంతరంగా వెబ్ సిరీస్ షూటింగ్ కాస్త ఆగిపోయిందట.