సంక్రాంతికి వచ్చి విజయ్ తప్పు చేస్తున్నాడా..?

P.Nishanth Kumar
ఈ ఈ సంక్రాంతికి టాలీవుడ్ లో సినిమా ల పండగ మొదలుకాబోతుంది.. ఇప్పటికే సోలో బ్రతుకే సో బెటర్ అంటూ సాయి ధరమ్ తేజ్ టాలీవుడ్ సినిమాల రిలీజ్ కు పునాది వేశాడు. ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తూ రామ్, రవితేజ, బెల్లం కొండ శ్రీనివాస్ లు తమ సినిమాలను సంక్రాంతి పండగకి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.. రామ్ రెడ్ అనే సినిమా లో నటిస్తుండగా, రవితేజ క్రాక్ అనే సినిమాలో నటించాడు..బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ సినిమాలో నటిస్తున్నాడు.  ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న ఈ సినిమా లు ఇటీవలే సెన్సార్ కూడా పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ గా ఉన్నాయి.. అధికారికంగా ప్రకటించాడు..
ఇక ఈ సినిమాలతో పాటు తమిళనాట మోస్ట్ వాంటెడ్ సినిమా గా రాబోతున్న మూవీ మాస్టర్ కూడా సంక్రాంతి రిలీజ్ కి రెడీ గా ఉంది.. విజయ్ దళపతి నటించిన ఈ సినిమా పై ప్రేక్షకులు భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు.. ఖైదీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న లోకేష్ కనకరాజన్ ఈ సినిమా కి దర్శకుడు తమిళంతో పాటు తెలుగులో నూ రిలీజ్ అవుతున్న ఈ సినిమా కి అనిరుద్ సంగీతం అందిస్తూన్నాడు..
తెలుగులో చూసుకుంటే మనకు అంత రిస్క్ లేదనే చెప్పాలి. రవితేజకు ఎంత ఇమేజ్ ఉన్నా అది పవన్ కళ్యాణ్, మహేష్ బాబు స్థాయిలో అయితే కాదు. కాబట్టి పైన చెప్పినంత విపరీత పరిణామాలు ఇక్కడ కనిపించవు. రామ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లు ఈయన తర్వాతే వస్తారు కాబట్టి నో టెన్షన్. మాస్టర్ డబ్బింగ్ వెర్షన్ కావడం అందులోనూ విజయ్ ఇక్కడేమి భారీ మార్కెట్ లేకపోవడం లాంటి కారణాల వల్ల విపరీతమైన హడావిడి అయితే మన థియేటర్ల దగ్గర కనిపించదు. అందుకే మాస్టర్ గురించి మాత్రమే తమిళనాడులో ఈ స్థాయిలో చర్చ జరుగుతోంది. పర్మిషన్లు ఇచ్చేశారు కాబట్టి చూస్తూ ఉండటం తప్ప ఎవరైనా చేయగలిగింది ఏమి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: