2020 హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ : ప్రేక్షకులను ఆహా అనిపించారు..!

shami
2020 కరోనా వచ్చి 9 నెలల దాకా థియేటర్లు మూతపడగా కరెక్ట్ గా అదే టైం లో కొత్త ఓటిటిని మొదలు పెట్టారు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. నిర్మాతగా ఆడియెన్స్ పల్స్ తో పాటుగా బిజినెస్ స్ట్రాటజీ బాగా తెలిసిన అల్లు అరవింద్ మై హోం రామేశ్వర రావు తో మొదలు పెట్టిన ఓటిటి సంస్థ ఆహా. అమేజాన్ ప్రైం, నెట్ ఫ్లిక్స్ లాంటి ఇంటర్నేషనల్ ఓటిటి ఫ్లాట్ ఫాములు ఉండగా వాటికి ధీటుగా కంప్లీట్ తెలుగు ఓటిటి ఫ్లాట్ ఫాం గా ఆహా మొదలు పెట్టారు.
మొదలు పెట్టిన ముహుర్తం కూడా బాగా ఉండటంతో సినిమాలు.. వెబ్ సీరీస్ లు.. స్పెషల్ టాక్ షోలు ఇలా అన్నిటితో తెలుగు ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నారు. ఆహా నిజంగానే ప్రేక్షకులను ఆహా అనిపించేలా చేసింది. 2020లో సూపర్ సక్సెస్ అయిన డిజిటల్ ఫ్లాట్ ఫాం గా ఆహా సూపర్ హిట్ అయ్యింది. అయితే ఆహా కోసం స్టార్ షోలను ప్లాన్ చేయడమే కాకుండా వెబ్ సీరీస్ లుగా కొత్త కొత్త కాన్సెప్ట్ లకు ఆహ్వానం చెబుతున్నారు.
ఇప్పటికే ఎన్నో కొత్త వెబ్ సీరీస్, వెబ్ మూవీస్ ఆహాలో రిలీజ్ అవగా ఇంకా కొత్తగా ఉండబోతాయని తెలుస్తుంది. అంతేకాదు ఆహా కోసం మెగాస్టార్ చిరంజీవితో కూడా ఓ వెబ్ సీరీస్ ప్లాన్ చేస్తాడని తెలుసుతుంది. మొత్తానికి ఆహా తెలుగు ఓటిటి ఫ్లాట్ ఫామే అయినా ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేయడంలో అదరగొడుతుందని చెప్పొచ్చు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: