ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ట్రెండింగ్ న్యూస్ చదవండి... బిర్యాని దీనిని ఇష్టపడని భారతీయ మాంసాహారే ఉండడు.బిర్యాని ముక్క నోట్లో పెట్టుకుంటే ప్రాణం జివ్వు మంటుంది. అంత రుచికరమైన వంటకం ఈ బిర్యాని. ఇక విషయానికి వస్తే వంటల్లో బిర్యాని సరికొత్త రికార్డు సృష్టించింది. కరోనా టైమ్లో జనాలు ఎక్కువగా తిన్న వంటకంగా బిర్యానీ కోసం రికార్డు సృష్టించింది.తాజాగా ఫుడ్ డెలవరీ యాప్ ‘స్విగ్గీ’ ఈ విషయాన్ని వెల్లడించింది.లాక్డౌన్ సమయంలో కూడా ప్రజలు బిర్యానీ మాత్రమే ఆర్డర్ చేసుకుని తిన్నారని తెలిపింది.2020లో ప్రజలు ఏయే వంటకాలను ఆర్డర్లు ఇచ్చారనే విషయంపై స్విగ్గి తాజాగా తమ గణంకాలను వెల్లడించింది. ఈ సందర్భంగా అత్యధిక భారతీయులు 2020లో బిర్యానీనే ఎక్కువ ఆర్డర్ చేసినట్లు తెలిపింది. రోజులో ప్రతి సెకనులో ఒకరు చొప్పున బిర్యానీ ఆర్డర్ చేస్తూనే ఉన్నారని పేర్కొంది. కొత్తగా స్విగ్గిని ఉపయోగిస్తున్న 3 లక్షలకు పైగా యూజర్లలో ఎక్కువ మంది చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసినట్లు వెల్లడించింది.
ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఆహార ప్రియులు రాత్రి వేళల్లో సరాసరి 342 క్యాలరీ డిన్నర్ను, మధ్యాహ్నం వేళ 340 క్యాలరీలు, ఉదయం 427 క్యాలరీల ఆహారాన్ని ఆర్డర్ చేసేవారని తెలిపింది.జనవరి నుంచి మార్చి నెల వరకు ఆఫీస్ నుంచి ఆర్డర్లు చేసేవారి కంటే ఇళ్ల నుంచి ఆర్డర్ చేసినవారి సంఖ్య ఐదు రెట్లు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. ఏప్రిల్ నుంచి మే నెలలో ఆ సంఖ్య 9 రెట్లు ఎక్కువైందని పేర్కొంది. అంటే.. లాక్డౌన్ వల్ల ఆఫీసులు మూసి ఉండటంతో చాలామంది ఇళ్ల నుంచి బిర్యానీ ఆర్డర్ చేశారని తెలుసుకోవచ్చు. ఇక ఇలాంటి మరెన్నో వైరల్ విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...
మరింత సమాచారం తెలుసుకోండి: