విజయ్ దేవరకొండ ని కూడా వదలని చిరంజీవి.. ఏమన్నారో తెలుసా..?

praveen
ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమను శాసించే స్థాయికి ఎదిగిన మెగాస్టార్ చిరంజీవికి తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై దశాబ్దాల గడిచిపోతున్నప్పటికే ఆయన క్రేజ్  మాత్రం ఇప్పటికీ చెక్కుచెదరలేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎంతో మంది యువ హీరోలకు ఆయన గొప్ప ఇన్స్పిరేషన్. ఇప్పటికే 150 పైగా సినిమాల్లో నటించినప్పటికీ ఆయన లో గ్రేస్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ప్రస్తుతం టాలీవుడ్ రారాజుగా తెలుగు చిత్ర పరిశ్రమకు బిగ్ బాస్ గా కొనసాగుతున్నారు మెగాస్టార్ చిరంజీవి.

 ప్రస్తుతం టాలీవుడ్ లోనే  బిగ్ స్టార్ గా కొనసాగుతున్నప్పటికీ మెగాస్టార్ చిరంజీవి ఎంతో మంది యువ నటులు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే ఇక ఈ మధ్య కాలంలో వివిధ షో లలో  కూడా ఎంతో హుషారుగా కనిపిస్తున్నారు. ఇక ఇటీవలే అక్కినేని వారి కోడలు సమంత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో సామ్  జామ్ లో డిజిటల్ వేదికపై దూసుకుపోతుంది. ఎంతో మంది సెలబ్రెటీలను సమంత ఇంటర్వ్యూ చేస్తుంది. ఇక ఇటీవల మెగాస్టార్ చిరంజీవిని  ఇంటర్వ్యూ చేసింది సమంత.  ఇక సమంత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోలో స్పెషల్ గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన మాటలతో ఆకట్టుకున్నారు.

 ఇక ఇటీవలే ఈ షోకి సంబంధించిన మరో ప్రోమో సోషల్ మీడియాలో విడుదలవ్వగా ఇది కాస్త ప్రేక్షకులను తెగ ఆకర్షిస్తోంది. ఈ ప్రోమో చూస్తే షో పై మరింత ఆత్రుత పెంచేస్తోంది. ఇక ఈ ప్రోమో లో భాగంగా.. వైవా హర్ష ఎంట్రీ ఇచ్చి మెగాస్టార్ చిరంజీవి ని ఒక ప్రశ్న అడుగుతాడు.. మీరు ఇప్పటికే ఎన్నో హిట్ సినిమాలు చేశారు ఒకవేళ అవి రీమేక్ చేయాలి అంటే మీ పాత్రలో ఏ  యువహీరో నటిస్తే బాగుంటుంది అంటూ ప్రశ్న అడగ్గానే వెంటనే స్పందించిన చిరంజీవి... చరణ్ తారక్ బన్నీ మహేష్ రవితేజ విజయ్ దేవరకొండ పవన్ కళ్యాణ్ అంటూ వరుసబెట్టి ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోల అందరి పేర్లు చెప్పి ఆశ్చర్యపరిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: