మూగ వాడిగా తనలోని వైవిధ్య నటుడిని బయటపెడుతున్న నాగ సౌర్య...

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... యంగ్ అండ్ హ్యాండ్సమ్  హీరో నాగశౌర్య అనేక సినిమాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇప్పుడు వరుసగా వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఈ రొమాంటిక్ హీరో  చేతుల్లో చాలా  సినిమాలున్నాయి. కుటుంబ కథా చిత్రాలతో పాటు యాక్షన్ సినిమాలు కూడా చేస్తున్నాడు. అలానే స్పోర్ట్స్ డ్రామాలో ఓ సినిమా ఒప్పుకొని.. దానికోసం కండలు పెంచి మైండ్ బ్లోయింగ్ లుక్ తో షాకిచ్చాడు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు లేటెస్ట్ గా  శౌర్య ఫస్ట్ టైం ఒక చాలెంజింగ్ రోల్ చేస్తున్నాడు. నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న సినిమాలో శౌర్యని ఓ పాత్ర కోసం సంప్రదిస్తున్నారు. శౌర్య కూడా ఈ సినిమా విషయంలో ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.కన్నడ దర్శకుడు శ్రీమన్ వేముల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

 ఈ సినిమాలో శౌర్య నలభై నిమిషాల పాటు కనిపించే పాత్ర అని తెలుస్తోంది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. సినిమా మొత్తం శౌర్య.. మూగ-చెవిటి వాడిగా కనిపిస్తాడట. అయితే ఈ పాత్ర ఎమోషనల్ గా కాకుండా ఫన్ తో కూడి ఉంటుందని టాక్. అందుకే ఈ పాత్ర శౌర్యకి బాగా నచ్చిందట. బాలకృష్ణ రోల్ మాత్రం పూర్తి నిడివితో ఉంటుందని తెలుస్తోంది.అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాదిలో ఈ సినిమా పట్టాలెక్కుతోంది. ప్రస్తుతం బాలయ్య.. బోయపాటి దర్శకత్వంలో మూడవ సారి ఒక మాస్ సినిమా  చేస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

 వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు  చేస్తున్నారు.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: