ఏలూరులో రిస్క్ చేస్తున్న సాయి ధరమ్ తేజ్..?

frame ఏలూరులో రిస్క్ చేస్తున్న సాయి ధరమ్ తేజ్..?

P.Nishanth Kumar
ఏలూరు లో ఇటీవలే పరిస్థితులను చూస్తూనే అక్కడికి వెళ్లాలంటేనే అందరు భయపడుతున్నారు.. అక్కడ నీరు కలుషితం కావడంతో కొంతమంది అనారోగ్యం పాలయ్యారు. ఇలాంటి సమయంలో అక్కడ షూటింగ్ చేస్తూ సాయి ధరమ్ తేజ్ రిస్క్ చేస్తునందని మెగా కాంపౌండ్ అభిప్రాయపడుతుంది. సాయి ధరమ్ తేజ్ - 'ప్రస్థానం' దేవకట్టా కాంబినేషన్ లో ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. పొలిటికల్ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రాన్ని జె.బి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జె.భగవాన్ - జె.పుల్లారావు నిర్మిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్  ఏలూరుకి షిఫ్ట్ అవ్వబోతుందని తెలుస్తోంది. అయితే ఏలూరు ప్రస్తుతం పరిస్థితులు బాగా లేకపోవడంతో తగిన జాగ్రత్తలు తీసుకొని దానికి తగ్గట్లుగా షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ఉన్న సాయి ధరమ్ తేజ్.. నిహారిక పెళ్లి వేడుక మరియు రిసెప్షన్ అయిన వెంటనే షూటింగ్ లో పాల్గొంటాడని తెలుస్తోంది.
రేయ్ సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ ఆ తర్వాత మంచి సినిమాలు చేసి ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు.. కానీ ఆ మధ్య వరుసగా 9 ఫ్లాప్ సినిమాలు చేసి చాలా డిప్రెషన్ కి గురయ్యాడు.. ఇటీవలే చిత్రలహరి, ప్రతిరోజు పండగే సినిమాలతో హిట్ తో మళ్ళీ రేస్ లో కి వచ్చేశాడు. సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. సుబ్బు అనే కొత్త దర్శకుడు ఈ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమవుతున్నాడు. నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ ఈ సినిమా కి సంగీతం అందిస్తుండగా ఈ సినిమా నుంచి వచ్చిన మూడు పాటలకు ప్రేక్షకులనుంచి మంచి స్పందన వచ్చింది. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: