మొత్తానికి 'కెజిఎఫ్ చాప్టర్ 2' టీజర్ రిలీజ్ డేట్ లాక్ చేసారు.... ??

GVK Writings
రాక్ స్టార్ యాష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న భారీ ప్రతిష్టాత్మక సినిమా కే జి ఎఫ్ చాప్టర్ 2. రెండేళ్ళ క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన కే జి ఎఫ్ చాప్టర్ 1 కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ అధీరా రానే విలన్ పాత్రలో నటిస్తుండగా ప్రముఖ నటి రవీనా టాండన్ రమిక సేన్ అనే కీలక పాత్రలో నటిస్తోంది.
శాండల్ వుడ్ తో పాటు బాలీవుడ్, టాలీవుడ్ సహా పలు సినిమా ఇండస్ట్రీలకు చెందిన కీలక నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక రిలీజ్ తర్వాత అప్పట్లో కే జి ఎఫ్ చాప్టర్ 1 సినిమా విడుదల అయిన అన్ని భాషల్లో కూడా అత్యద్భుత విజయాన్ని దక్కించుకుని విపరీతమైన కలెక్షన్లు సంపాదించడం జరిగింది. ఇటీవల కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమా ఫస్ట్ పోస్టర్ ప్రేక్షకుల ముందుకు వచ్చి సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేసింది. లాక్‌డౌన్‌ కు ముందు చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ కొద్ది రోజుల క్రితం ప్రారంభం అవ్వగా దానిని వీలైనంత త్వరగా పూర్తి చేసి సినిమాని ఎట్టిపరిస్థితుల్లో వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే లా మూవీ యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి రవి బస్రూర్ సంగీతాన్నందిస్తున్నారు.
ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి ఇటీవల హీరో యాష్ అభిమాని ఒకరు తనని సోషల్ మీడియా అకౌంట్స్ లో అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ కేజీఎఫ్ 2 సినిమా ఫస్ట్ లుక్ టీజర్ జనవరి 8న యాష్ బర్త్ డే సందర్భంగా రిలీజవుతుందని చెప్పుకొచ్చారు నిర్మాత విజయ్. దీన్నిబట్టి అదేరోజున టీజర్ రిలీజ్ అవ్వడం పక్కా అని ఇప్పటినుంచే సంబరాలు చేసుకుంటున్నారు యాష్ ఫ్యాన్స్. కాగా ఈ సినిమా నుండి తొలిపాట కూడా అదే నెలలో రిలీజ్ కానున్నట్లు టాక్ . మొత్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కే జి ఎఫ్ చాప్టర్ 2 టీజర్ తొలి టీజర్ డేట్ లాక్ అవటంతో పలువురు ప్రేక్షకులు కూడా ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: