రామ్‌చరణ్ ఆశలన్నీ ఆ సినిమాపైనే !
రామ్‌చరణ్ సినిమా వచ్చి దాదాపు రెండేళ్లవుతోంది. 2019 సంక్రాంతికి వచ్చిన వినయ విధేయ రామ తర్వాత మరో మూవీ రాలేదు. అప్పట్నుంచీ ఆర్‌ఆర్ఆర్‌తో సహజీనం చేస్తూనే ఉన్నాడు చెర్రీ. రంగస్థలం వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వచ్చిన వినయ విధేయ రామ డిజాస్టర్ కావడం.. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఆర్‌ఆర్‌ఆర్ రాకపోవడంతో.. గ్యాప్‌లో పడిపోయాడు రామ్‌చరణ్.
వినయ విధేయ రామ ఫ్లాప్ తర్వాత చెర్రీ గ్యాప్‌లో పడినా.. రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నానన్న ధీమాతో మెగా ఫ్యాన్స్ ఉన్నారు. చెర్రీ ఇందులో అల్లూరి సీతారామరాజుగా పవర్‌ఫుల్ రోల్లో కనిపిస్తున్నాడు. మరోవైపు.. యాక్టింగ్‌లో ఆరితేరిన ఎన్టీఆర్‌ను ఢీ కొట్టి నటించాలి. ఇప్పటికే రిలీజైన టీజర్‌తో తారక్‌కు ఏమాత్రం తగ్గడని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. పెర్‌ఫార్మెన్స్ ఎలా ఉన్నా.. సినిమా హిట్టవ్వడమే ముఖ్యం.
ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత తారక్ త్రివిక్రమ్ మూవీ చేస్తాడు. చిరంజీవి.. పవన్‌కల్యాణ్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. పుష్ప తర్వాత బన్నీ కొరటాల మూవీలో జాయిన్ అవుతాడు. ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత వాట్ నెక్ట్స్ అంటే.. చెర్రీ నుంచి సమాధానం దొరకడం లేదు. చాలామంది దర్శకుల పేర్లు వినిపించినా ఒక్కటీ ఖరారు కాలేదు. ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్ ఫిబ్రవరినాటికి పూర్తవుతుంది. కెరీర్‌ను ప్లాన్ చేసుకోవడంలో కూడా చెర్రీ వెనుకపడ్డాడు.
మొత్తానికి మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్.. ఆర్ఆర్ఆర్ పైనే బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు. రెండేళ్లుగా ఒక్కసినిమాకే కమిట్ అయి కష్టపడుతున్నాడనే దీన్నిబట్టి అర్థమవుతుంది ఆయన.. ఈ సినిమాపై ఎంత నమ్మకం పెట్టుకున్నాడో. రామ్ చరణ్ మొన్న నటించిన వినయ విధేయ రామ్ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోవడంతో ఆర్ఆర్ఆర్ పై చాలా హోప్స్ పెట్టుకున్నాడు ఈ మెగా తనయుడు.