హారిక చడ్డీలు వేసుకుంటే మీకంటే.. అది నా కూతురు ఇష్టం.. ఫైర్ అయిన హారిక తల్లి జ్యోతి...!

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...బిగ్ బాస్ సీజన్‌ 4 చాలా ఆసక్తికరంగా కొనసాగుతుంది. దాదాపు ఇప్పుడు చివరి దశకు చేరుకుంది ఈ సీజన్. ఇక ఈ సీజాన్లో దేత్తడి హారిక చాలా బాగా ఆడుతూ తన  సత్తా చూపిస్తోంది. సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్‌తో ఎలిమినేషన్స్ నుంచి సేవ్ అవుతూ 12వ వారంలోకి విజయవంతంగా అడుగుపెట్టింది. ఖచ్చితంగా టాప్ 5 లోకి వెళుతుందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుంది. ఇంకా నాలుగు వారాలు మిగిలి ఉండగా.. ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు. వీరిలో హారిక టాప్ 5 వెళ్లే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నా.. మిగిలిన ఆరుగురు కంటెస్టెంట్స్ నుంచి గట్టి పోటీ ఇస్తున్నారనే చెప్పాలి.
ఇక కొంతమంది ఈమె వస్త్రధారణ గురించి వివరిస్తున్నారు. నడుము కనపడేలా టాప్స్ వేసుకొని, కాళ్ళు, తొడలు కనపడేలా పై దాకా షార్ట్స్ వేసుకొని తెగ ఎక్సపోసింగ్ చేస్తూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.నిజానికి ఈమె స్టార్టింగ్ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడమే చాలా హాట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ ఎంట్రీ సీన్లో తొడలు కనిపించేలా గ్లామర్ ఆరబోసి హాట్ గా డాన్స్ చేసింది. ఇక బిగ్ బాస్ హౌస్ లో కూడా చెడ్డీలతో షార్ట్స్ తో ఎక్సపోసింగ్ చేస్తుందని విమర్శలు వస్తున్నాయి.
ఈ విమర్శలు వస్తున్న తరుణంలో హారిక తల్లి ఈ విధంగా స్పందించారు. మా అమ్మాయి బట్టలు ఆమె ఇష్టం.. వద్దనడానికి మీరు ఎవరు అంటూ సీన్‌లోకి వచ్చారు హారిక తల్లి, అన్న. ఒక ఆడపిల్ల డ్రెస్ గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు.. ఏ డ్రెస్ వేసుకోవాలన్నది ఆమె ఇష్టం. తన డ్రెస్ తన ఇష్టం. అలాగని ఆమెను బికినీలో తిరగమని నేను చెప్పడం లేదు.. లంగాఓణీలు మన కల్చరే కావచ్చు కానీ.. అక్కడ పరిస్థితుల్ని బట్టి బట్టలు వేసుకుంటుంది. ఇదే హారికను ట్రోల్ చేసేవారికి నేను ఇచ్చే సమాధానం అంటూ తన కూతుర్ని డ్రెస్ విషయంలో వస్తున్న విమర్శలపై సమాధానం ఇచ్చారు హారిక తల్లి జ్యోతి.ఇక ఇలాంటి మరెన్నో బిగ్ బాస్ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: