RRR కోసం అమిర్ ఖాన్ ని బరిలోకి దింపనున్న రాజమౌళి

Malathiputhra
rrr  కోసం రాజమౌళి మరో ఎత్తుగడ వేస్తున్నట్లు టాలీవుడ్ లో మాటలు వినిపిస్తున్నాయి .. భారీ తారాగణం తో జక్కన్న తెరకెక్కిస్తున్న rrr రోజురోజుకి ఒక కొత్త వార్తని ప్రకటిస్తుంది .. ఆ వార్తతో rrr పై అంచనాలు పెరిగిపోతున్నాయి .. ఈ సినిమాకి సంబందించిన మరో ఆసక్తికర న్యూస్ బయటపడింది .. అదేంటంటే ఈ సినిమా కోసం అమిర్ ఖాన్ ని రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం అందుతుంది ..
అయితే rrr  సినిమా కోసం హిందీ లో  అమిర్ ఖాన్ చేత రాజమౌళి వాయిస్ ఓవర్ ని  చెప్పిస్తారనే వార్తలు వ్యాపిస్తున్నాయి ..అమిర్ ఖాన్ తో పాటు తెలుగు లో మెగాస్టార్ చిరంజీవి చేత వాయిస్ ఓవర్ చెప్పించబోతున్నారనే వార్తలు టాలీవుడ్ అంత గుప్పుమంటున్నాయి ..సినిమాలోని హీరోల పాత్రలను పరిచయం చేయడం కోసం వీళ్ళ వాయిస్ ని సినిమాలో వాడబోతున్నట్లు రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు ..
ఈ విషయమని ఇరువురి నటులు కూడా వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు ఒప్పుకున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి .. ఇందులో నిజమెంత అనేది   తెలియరాలేదు .. కానీ rrr  లాంటి సినిమాకి ఈ ప్రముఖులు వాయిస్ ఓవర్ చెప్పడం అనేది ప్రధాన ఆకర్షణగా నిలవనుంది ..
ప్రస్తుతం rrr  సినిమా షూటింగ్ మొదలైపోయింది ... శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది .. మూవీ హీరోయిన్స్ కూడా త్వరలో పాల్గొననున్నట్లు తెలుస్తుంది ..భారీ తారాగణం తో రూపొందుతున్న ఈ సినిమాని డీవీవీ దానయ్య గారు నిర్మిస్తున్నారు .. యం యం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు .. వచ్చే నెల వేసవిలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నామని మూవీ టీం ప్రకటించింది .. బాహుబలి తర్వాత పాన్ ఇండియా తరహాలో తెరకెక్కుతున్న సినిమా కావున అభిమానుల అంచనాలు తార స్థాయిలో  ఉండడం విశేషం .. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: