వీడియో వైరల్: జబర్దస్త్ స్టేజీపై రచ్చ.. వర్కర్ బెదిరించిన టీం లీడర్..!

N.ANJI
బుల్లితెరపై గత ఎనిమిదేళ్లుగా తనదైన శైలిలో దూసుకెళ్తున్న షో జబర్దస్త్. ఈ షో ద్వారా ఎంతో మందికి జీవనోపాధిని కలిపించింది. ఈ షో ద్వారా బుల్లితెరకు ఎంతో మంది కమెడియన్లు పరిచయమైయ్యారు. జబర్దస్త్ వివాదాలకు కూడా మారుపేరుగా నిలుస్తుంది. ఎన్నో సందేహాలతో మొదలైన ఈ షో కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అత్యధిక ఎపిసోడ్స్ చేసిన కామెడీ షో గా జబర్దస్త్ నిలిచింది. అయితే తాజాగా జబర్దస్త్ షో లో అపశృతి చోటు చేసుకుంది.
అయితే స్కిట్ జరుగుతున్నపుడు ఒక వర్కర్ పొరపాటు చేశాడనే కారణంతో స్టేజ్ పైనే అతనిని టీమ్ లీడర్ కొట్టబోయాడు. ఒక టీం లీడర్ అనవసరపు వాగ్వాదానికి దిగాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సుడిగాలి సుధీర్, అనసూయ, రష్మీ, హైపర్ ఆది జబర్దస్త్ లో ఎంత ఫేమస్ అయినప్పటికీ మొదటి నుండి షోని అంటిపెట్టుకుని ఉన్న కమెడియన్ అదిరే అభి. అతని కామెడీలో పస లేదని చాల మంది విమర్శలు చేస్తుంటారు. కానీ స్టాండర్డ్ గా ఇన్నేళ్ళు ఒక టీం లీడర్ గా ఉన్నాడు అంటే గొప్ప విషయమే.

ఇక హైపర్ ఆది కూడా గతంలో అభి అనుచరుడే. అయితే అభి తాజాగ స్కిట్ చేస్తున్న సమయంలో ఒక వర్కర్ తప్పుడు టైమ్ లో కుర్చీ వేశాడని అతనిపై కుర్చీని అభి విసిరేశాడు. అంతేకాకుండా అక్కడితో ఆగకుండా సదరు వర్కర్ ను కొట్టేందుకు దూసుకుపోయాడు. ఒకవైపు నుండి అనసూయ కామ్ అభి, కూల్ అభి అని అనింది కానీ అతను మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. ఇక అలాగే గొడవను ఆపడానికి వచ్చిన రోజాతో టీం లీడర్ వాదనకు దిగాడు. ఇలాంటి చెత్త పనులు చేయడం వల్ల ఏకాగ్రత దెబ్బతింటుందని ఆమెకు వివరణ ఇచ్చాడు. ఇక ఇప్పుడు ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: