"విక్రమ్" సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని గట్టి నమ్మకం పెట్టుకున్న కమల్...
ఇదిలా పూర్తయ్యిందో లేదో కానీ.. వెంటనే కమల్ హాసన్ తో తన నెక్స్ట్ సినిమాని రూపొందించడానికి రెడీ అయిపోయాడు లోకేష్. ‘విక్రమ్’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించి అప్పుడే ఓ టీజర్ ను కూడా విడుదల చేసేసాడు.అందుతున్న సమాచారం ప్రకారం..‘విక్రమ్’ చిత్రాన్ని కూడా లోకేష్ కేవలం 56 రోజుల్లోనే ఫినిష్ చేసేలా స్క్రిప్ట్ ను చాలా పక్కాగా రెడీ చేసుకున్నాడట. ‘ఖైదీ’ చిత్రానికి మించి ఈ చిత్రం ఉండబోతుందని చిత్ర యూనిట్ సభ్యుల సమాచారం. చాలా రోజుల నుండీ కమల్ ను పక్కా మాస్ యాంగిల్ లో చూడాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ‘విక్రమ్’ చిత్రం వారి అంచనాలను మించే ఉండబోతుందని టాక్. ఈ సినిమాపై కమల్ హాసన్ కూడా చాలా నమ్మకంగా వున్నాడట. ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..